Fri Dec 05 2025 22:46:46 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది

పసిడి కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సాదాసీదా మనుషులకు సాధ్యం కాదు. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే బంగారం కొనుగోలు చేయడం సులువుగా మారింది. మహిళలు అత్యంత ఇష్టపడి కొనుగోలు చేసే బంగారం ధరలు పెరిగిపోతుండటంతో వారిలో కూడా నిరాశ కనపడుతుంది. సాధారణంగా గతంలో మహిళలు మాత్రమే ఎక్కువగా బంగారంపై మక్కువ చూపే వారు. కానీ నేడు మాత్రం పురుషులు కూడా బంగారం కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఇక గతంలో సంప్రదాయం మేరకు మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేవారు. నేడు అలంకరణ కోసం, స్టేటస్ సింబల్ కోసం ఈ కాలం యువతులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.
డిమాండ్ తగ్గని...
అందుకే బంగారానికి సాధారణంగా డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. కానీ ఈ ఏడాది నుంచి బంగారం ధరలు పెరుతుండటంతో అన్ని వర్గాలు బంగారం, వెండి కొనుగోలుకు దూరమయ్యారనే చెప్పాలి. దక్షిణ భారత దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్టాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తర భారతంతో పోల్చుకుంటే ఇక్కడ బంగారం, వెండి క్రయ, విక్రయాలు ఎక్కువగా సాగుతాయి. అందుకే సౌత్ ఇండియాలో ఉన్నన్ని జ్యుయలరీ దుకాణాలు దేశంలో మరే ప్రాంతంలో కనిపించవు. కానీ ధరలు పెరుగుతూ ఉండటంతో ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గాయి.
మళ్లీ పెరిగి...
బంగారం అంటే స్టేటస్ సింబల్ మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా కావడంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ గత కొద్ది రోజులుగా విక్రయాలు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,850 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరలు 1,19,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది
Next Story

