Fri Dec 05 2025 21:45:19 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : లక్షకు దగ్గరగా బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధర్లల్లో కొంత తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. తగ్గినట్లు కనిపించినా తగ్గడం అనేది జరగదు. గత కొంత కాలం నుంచి అంటే దాదాపు ఐదు నెలల నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారీగా బంగారం ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు కూడా కొంత కొనుగోలుకు జంకుతున్నారు.మహిళలు సహజంగా బంగారాన్ని ప్రేమిస్తారు. బంగారాన్ని ప్ర్రేమించినంతగా ఏ విషయంలోనూ అంత ప్రేమ చూపించరు. బంగారం కొనుగోలు చేయడం అంటే అదొక క్రేజ్ గా భావిస్తారు. బంగారాన్ని చూస్తేనే మహిళల తనువును పులకరిస్తుంది. ఇక దానిని సొంతం చేసుకుంటే అంతకంటే ఆనందం వారిముఖాల్లో మరే సంఘటనలో కనపడదన్న సామెత ఉండనే ఉంది.
అనేక కారణాలతో...
ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలలో జరుగుతున్న ఒడిదుడుకులతో పాటు దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అనేకదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, దేశంలో దిగుమతి చేసుకునే బంగారం నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పడు బంగారాన్నికొనుగోలు చేయడం మంచిదేనా? అన్న అనుమానాలు కూడా అనేక మంది వ్యక్తం చేస్తున్నారు.మార్కెట్ నిపుణులు మాత్రం ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
పెట్టుబడి పెట్టేవారు...
బంగారం పెట్టుబడి పెట్టేవారు కూడా ఆలోచించకుండా కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. పెట్టుబడులు సురక్షితంగానే ఉంటాయని అంటున్నారు.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధర్లల్లో కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరలపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్లపది గ్రాముల బంగారం ధర 91,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,290 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,18,800 ట్రేడ్ అవుతోంది.
Next Story

