Fri Dec 05 2025 16:18:25 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : నేడు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయంటే?
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా అదే విధంగా నిలకడగానే కొనసాగుతున్నాయి

దేశంలోనే కాదు.. ప్రపంచంలో డిమాండ్ పడిపోని వస్తువు ఏదైనా ఉంటుందా? అంటే అది బంగారమే అని ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే దాని విలువ పెరగడమే కాని తరగదు. అలాంటి బంగారం సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు సాధ్యం కావడం లేదు. బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోయాయి. అత్యవసరమయితే తప్ప పసిడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అదీ శుభకార్యాలకు మాత్రమే కొనుగోలు చేయాలన్న పరిస్థితికి వచ్చింది.
కొనాలని ఉన్నా....
ఒకప్పుడు బంగారం అంటే సాధారణమే... కానీ ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. ఎంత బంగారం ఉంటే అంత సమాజంలో గౌరవం లభించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇటు బంగారాన్ని కొనాలని ఉన్నా సరిపడా సొమ్ములు లేక కొందరు దానివైపు ఆశగా చూస్తున్నారు. కొందరు మన వస్తువు కాదులే అన్న ధోరణి ఇప్పుడిప్పుడే వస్తుంది. అలాంటి బంగారం ధరలు ఎప్పుడు తగ్గినా అది పసిడి ప్రియులకు ఊరట కల్గించే విషయమే. కేవలం ధరలు తగ్గడమే కాదు స్థిరంగా ఉంటే అదే పదివేలు అనుకునే పరిస్థితికి వచ్చింది.
రెండూ నిలకడగానే...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో బంగారం ధరల్లో మార్పు లేదు. వెండి ధరలు కూడా అదే విధంగా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో 77,000 రూపాయలుగా నమోదయి ఉంది.
Next Story

