Fri Dec 05 2025 17:34:28 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. రేట్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది

బంగారం డిమాండ్ తగ్గినా ధరలు మాత్రం తగ్గడం లేదు. ఏ దైనా వస్తువుకు డిమాండ్ తగ్గితే ధరలు తగ్గుతాయి. కానీ బంగారం విషయంలో మాత్రం అలా జరగడం లేదు. బంగారానిది మాత్రం ఇందులో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఎందుకంటే డిమాండ్ తో సంబంధం లేకుండా ధరల్లో మార్పులు, చేర్పులు జరిగేది బంగారం విషయంలోనే. బంగారం, వెండి వస్తువులు స్టేటస్ సింబల్ గా ఉండటంతో సహజంగా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో ధరలు బాగా పెరగడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో డిమాండ్ చాలా వరకూ తగ్గింది. అయినా బంగారం, వెండి ధరల్లో మార్పు లేకపోగా ఇంకా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
తగ్గడం ప్రారంభించినా...
బంగారం ధరలు కొద్దిగా తగ్గడం ప్రారంభించాయి. కొన్ని రోజులు తగ్గినప్పటికీ ఆశించిన రీతిలో ధరలు తగ్గలేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నప్పటికీ ధరల పతనం భారీగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్పడంతో కొనుగోలు చేసే వారు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. ధరలు బాగా తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చు అన్న భావనలో ఉన్నారు. పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసి పెట్టుబడి పెడితే తమకు నష్టం వస్తుందని భావించి కొంత వెనక్కు తగ్గారు. బంగారంపై పెట్టుబడి అంటే సురక్షితమైనదిగా మొన్నటి వరకూ భావించే వారు కూడా ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నారు.
భారీగా పెరిగి...
బంగారం కంటే ఇతర ప్రత్యామ్నాయాలపైన పెట్టుబడులు పెట్టడం మేలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే ఇప్పులు లక్షల రూపాయలు కావాల్సి రావడంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు కూడా దానికి దూరమయ్యారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 89,760 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగరం ధర 97,920 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 1,12,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

