Thu Jan 29 2026 19:37:14 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : హోలీ పండగ నాడు షాకిచ్చిన బంగారం ధరలు.. తులం బంగారం తొంభై వేలుకు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరగుదల కనిపించింది

హోలీ పండగ నాడు దేశ వ్యాప్తంగా ప్రజలు రంగులతో వేడుకలను జరుపుకుంటే బంగారం ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదేమీ కొత్తేమీ కాకపోయినా ఇప్పుడే బంగారం ధరలు తొంభయి వేలకు చేరుకోవడంతో ఇక లక్ష రూపాయలు చేరుకోవడానికి ఎంతో దూరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ఏడాది ఖచ్చితంగా పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నా ధరలు పెరుగుదల వినియోగదారులకు షాకింగ్ గురి చేసింది.
రికార్డు స్థాయిలో...
బంగారం ధర తొలిసారి 90 వేల మార్క్ ను చేరిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోళ్లు లేకపోయినా సరే బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. వాటికి కొనుగోళ్లతో సంబంధం లేదు. అందుబాటులో ఉండే నిల్వలను బట్టి ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప కొనుగోలు చేయడం లేదని ధరలు పెరగ కుండా ఆగవు. అలాగే బంగారం ధరలు పెరగకుండా నియంత్రించే ఛాన్స్ ఎవరి చేతిలోనూ ఉండదు. ఎందుకంటే అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతులు నిలిచిపోవడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి.
భారీగా పెరిగి...
బంగారం, వెండి అంటే ఇష్టమున్నప్పటికీ పెరిగిన ధరలను చూసి ఎవరూ కొనేందుకు ముందుకు రారు. అయినా సరే పెట్టుబడి పెట్టే వారు మాత్రం బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించి వారు కొనుగోలు చేస్తుంటారు. పెట్టుబడి పెట్టేవారు ఆభరణాలకంటే ఎక్కువగా బిస్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,210 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,590 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,10, 000 రూపాయలుగా నమోదయింది.
Next Story

