Sat Dec 06 2025 19:41:39 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గోల్డ్ లవర్స్ కు షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు మాత్రం
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు ఒకసారి తగ్గితే పలుమార్లు పెరుగుతుంటాయి. ఎక్కువ సార్లు పెరుగుతూ తక్కువ సార్లు తగ్గుతుండటం బంగారానికి ఉన్న సంప్రదాయంగానే చూడాలి. సీజన్ లో కానీ, అన్ సీజన్ లో గాని అది నిమిత్తం లేకుండా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో కొనుగోలు దారులు కొంత దూరంగానే ఉంటున్నారు. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగింది. మొన్న, నిన్న పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గగా, ఈరోజు ఏకంగా వందల రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కొనుగోళ్లు మందగించి...
పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తున్నా బంగారం కొనుగోళ్లలో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. ఎందుకంటే ధరలు పెట్టి బంగారం కొనుగోలు చేసే స్థోమత లేక కొనుగోలుదారులు వెనక్కు తగ్గుతున్నారు. అదే సమయంలో వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం, వెండి వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. స్టేటస్ సింబల్ గా భావిస్తారు. బంగారం అంటేనే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతారు. గతంలో కొద్దికొద్దిగా దాచుకున్న డబ్బును బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు. కానీ నేడు ధరలు పెరగడంతో తమ వద్ద దాచుకున్న డబ్బులు కూడా సరిపోవడం లేదని షాపుల వైపు కూడా చూడటం లేదు.
భారీగా పెరిగి...
అదే సమయంలో బంగారం ధరలను తగ్గించి విక్రయిస్తున్నా వ్యాపారుల వద్దకు రావడం మానేశారు. పాత బంగారంపై వెయ్యి రూపాయలు తగ్గింపు ప్రకటనలు చేసినా ఫలితం లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పపది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,110 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,390 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 1.04,900 రూపాయలుగా ఉంది.
Next Story

