Fri Sep 13 2024 08:47:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్లక్.. పెరిగిన బంగారం ధర
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి
పసిడి అంటే మక్కువ లేని వారు ఎవరుంటారు. అందునా మహిళలు పసిడి అంటేనే ఫ్లాట్ అయిపోతారు. ఎప్పుడెప్పుడు కొనుగోలు చేయాలా? అని తపన పడుతుంటారు. చిన్న కార్యక్రమమైనా బంగారాన్ని కొనుగోలు చేయడానికే మహిళలు ఎక్కవగా మొగ్గు చూపుతుంటారు. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇతర దేశాల్లో మాదిరి గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం ఇక్కడ అలవాటు లేదు. బంగారు ఆభరణాలను వివిధ రకాల డిజైన్లలో ఉన్న వాటిని తమ సొంతం చేసుకునేందుకే ప్రయత్నిస్తుంటారు.
వెండి మాత్రం...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,460 రూపాయలకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల పది గ్రాముల బంగారం ధర 60,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 74,600 రూపాయలుగా నమోదయింది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Next Story