Fri Dec 05 2025 17:33:27 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ప్రియమైన బంగారం దిగి వస్తుందిగా.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది

బంగారం అంటే పిచ్చి లేనిదెవరికి? ప్రతి ఒక్కరూ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. తమకున్న శక్తి మేరకు బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేయాలన్న ఆశ కూడా చచ్చిపోయిందనే చెప్పాలి. బంగారం తమ ఇంటికి రాదని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే బంగారం ధరలు పెరిగితే ఇక తగ్గవన్నది అందరికీ తెలిసిందే. తగ్గినా కొద్దో గొప్పో తగ్గుతాయి తప్పించి భారీ స్థాయిలో పెరిగిన బంగారం ధర మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేంత పరిస్థితికి తిరిగి రావడం అనేది జరగదు. మార్కెట్ నిపుణులతో పాటు బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పెరిగి.. తగ్గుతూ...
ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరల పెరుగుదల ప్రారంభమయి మార్చి నెల నాటికి పీక్స్ కు చేరుకుంది. ఏప్రిల్ నెలలో అయితే లక్ష రూపాయలను టచ్ చేసి వచ్చేసింది. అయితే ఇది ముందుగా అంచనా వేసిందే. కానీ ఆ తర్వాత ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో బంగారం ధరలు కొంత మేరకు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. లక్ష రూపాయల నుంచి నేడు 96 వేల రూపాయలకు పది గ్రాముల బంగారం ధర చేరుకున్నప్పటికీ అంత పెద్దమొత్తం వెచ్చించడం పేద, మధ్యతరగతి ప్రజలకు భారమేనని చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ కూడా నాలుగు రోజుల్లో ముగియనుండటంతో ఇక కొనేవాళ్లు కూడా ఉండరు.
స్వల్పంగా తగ్గి...
గోల్డ్ అంటే గతంలో మాదిరి కాదు. గతంలో ప్లాటినం ఖరీదైన ఆభరణంగా ఉండేది. కానీ నేడు ప్లాటినం ధరలను మించి బంగారం ధరలు పెరిగిపోవడంతో బంగారం మరింత భారంగా మారింది. స్టేటస్ సింబల్ గా భావించే వారు సయితం బంగారం కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. కిలో వెండి ధర వంద రూపాయల మేరకు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి మారవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,190 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,300 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,10,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

