Tue Dec 16 2025 23:47:26 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : వరసగా గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు అమాంతంగా పెరగడం మామూలయిపోయింది. దీనికి వినియోగదారులు కూడా అలవాటు పడిపోయారు. వరసగా ధరలు పెరుగుతుండటంతో బంగారం, వెండి వస్తువులు అంటూ ఒకటి ఉన్నాయన్న విషయాన్ని కొందరు మర్చిపోయారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన నాటి నుంచి తీసుకున్న నిర్ణయాలతో బంగారం, వెండి ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయంటారు. దీంతో పాటు అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాద్యం, వివిధ దేశాల మధ్య యుద్ధవాతావరణం వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డిమాండ్ తగ్గదని అనుకున్నా...
బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదని వేసుకున్న అంచనాలు ధరలు పెరగడంతో మాత్రం అవి తిరగబడ్డాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరల పెరుగుదల మొదలయిన నాటి నుంచి పెళ్లిళ్ల సీజన్ లోనూ, అక్షర తృతీయ వంటి రోజున కూడా అమ్మకాలు పెద్దగా జరగలేదంటే కొనుగోళ్లపై ఏ రకమైన ప్రభావం చూపుతుందన్నది అర్ధమవుతుంది. అందుకే ధరలు అందుబాటులో ఉంటేనే ఎవరైనా కొనుగోలు చేస్తారని, ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తేనే ఎక్కువగా సేల్స్ ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు బంగారం, వెండి ఆభరణాలకు దూరమవ్వడం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది.
ధరలు తగ్గినా...
బంగారం అంటే ఎన్నటికీ వన్నె తగ్గదు. అలాగే ధర కూడా ఎన్నడూ తగ్గదన్న నమ్మకంతోనే పెట్టుబడిదారులు కూడా కొంత వెనకంజ వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి వస్తువులు భారీగా తగ్గడం కూడా కొంత పెట్టుబడి దారులు కొనుగోలు చేయడానికి సాహసించలేదని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,090 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,920 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర .1,07,900 రూపాయలకు చేరుకుంది.
Next Story

