Fri Dec 05 2025 17:40:47 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : తగ్గడమంటే ఇదా... ఈ తగ్గడమేంటి గురూ... నేడు బంగారం ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. తగ్గాయని చెబుతున్నప్పటికీ గ్రాముపై రూపాయి మాత్రమే తగ్గుతుంది. పెరిగినప్పుడు వందల రూపాయలు పెరిగి తగ్గుతున్నప్పుడు మాత్రం పది రూపాయలు తగ్గుతుండటంతో పది గ్రాముల బంగారం ధర ఇంకా లక్ష రూపాయలకు పైగానే ఉంది. లక్ష రూపాయల నుంచి దిగి రావడం లేదు. ఇలా తగ్గుతుంటే పోతే ఎప్పటికీ లక్ష రూపాయలు దిగిరాదన్నది కొనుగోలుదారుల అభిప్రాయం. తగ్గడమంటే పెరిగిన స్థాయిలో తగ్గితే దానిని తగ్గడమని అంటారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే అసలు పెరగకపోవడం కంటే ఎంతో కొంత తగ్గడం మంచిదే కదా? అన్న అభిప్రాయం మాత్రం మరికొందరిలో వ్యక్తమవుతుంది.
ధరలు తగ్గడానికి...
బంగారం ధరలు అనేక కారణాల వల్ల పెరుగుతాయి. తగ్గుతాయి. దేశీయంగానే కాకుండా విదేశాలకు సంబంధించిన కారణాలున్నాయి.డాలర్ రూపాయి కంటేబలంగా ఉన్నప్పుడు బంగారం కొనుగోలు ఖర్చు ఎక్కువై డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే బంగారం ధర తగ్గుతుందని అంటారు. దీంతో పాటు బంగారం ధరలు ఎక్కువగా ఉన్నప్పుడే తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మకానికి పెట్టడం కూడా ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమి అంటున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాల వంటి కారణాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గినా...
ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో ధరలు మరింత పెరుగుతాయని అనుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్వల్పంగానైనా గత కొద్ది రోజుల నుంచి తగ్గుతున్నాయని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,170 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 1,26,100 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story

