Fri Dec 05 2025 13:16:41 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : గ్రాము కొనాలన్నా గగననమే.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

పసిడి కొనాలంటే ఇప్పుడు అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే గతంలో కంటే పసిడి ఎన్నో రెట్లు పెరిగి పైకి ఎక్కి కూర్చుంది. అది కిందకు దిగే అవకాశాలు మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. ధరలు పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా తగ్గడం బంగారానికి ఉన్న ఏకైక లక్షణం. అందుకే ధరలు పెరిగినప్పుడు పెద్దగా ఆందోళన చెందకుండా మనసు నిబ్బరం చేసుకునే మానస్థితికి మహిళలు చేరుకున్నారు. ఎందుకంటే నిత్యం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు కూడా కొనుగోలుకు ఉత్సుకత చూపడం లేదు. ముఖ్యంగా మహిళలు ధరలను చూసి దుకాణాలవైపు చూడటం కూడా మానేశారు.
అమ్మకాలు తగ్గి...
ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అందుకే గత ఏడాదితో పోలిస్తే బంగారం కొనుగోళ్లు దాదాపు అరవై నుంచి డెబ్భయి శాతం అమ్మకాలు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లక్ష రూపాయలు పది గ్రాముల బంగారం ధర దాటి పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. లక్ష రూపాయలు వెచ్చిస్తే సరైన నగ కూడా రావడం లేదు. చిన్న పాటి గాజులు కొనుగోలు చేయాలంటే కనీసం రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నప్పటికీ బంగారం అమ్మకాలు పెద్దగా జరగడం లేదని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం వాపోతుంది.
స్వల్పంగా తగ్గినా...
మరొకవైపు భారతీయ మహిళలు, దక్షిణ భారత దేశంలోనూ కొనుగోళ్లు తగ్గడం గతంలో ఎన్నడూ జరగలేదని అంటున్నారు. అనేక కారణాలతో ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ బంగారం మాకొద్దు అనే పరిస్థితికి మహిళలు చేరుకుంటున్నారు. ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 94,440 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,03,030 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,26,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

