Sat Jun 21 2025 04:56:46 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి పెరిగిన బంగారం ధరలు కొద్దో గొప్పో తగ్గుతాయి తప్పించి భారీగా తగ్గుదల బంగారం విషయంలో ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్నడూ లేనిది పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోవడంతో ఇక బంగారం కొనుగోలు చేయలేమనే పరిస్థితి వచ్చింది. తర్వాత కొన్ని రోజుల పాటు లక్ష రూపాయల నుంచి దిగి వచ్చినప్పటికీ తిరిగి మళ్లీ ధరలు పుంజుకుని లక్ష రూపాయలకు అటు ఇటుగా ఉండటంతో పాటు వెండి ధరలు కూడా ప్రియంగా ఉండటంతో దీని ప్రభావం అమ్మకాలపై భారీగా పడిందనే అనుకోవాలి.
సీజన్ ముగియడంతో...
అయితే లక్ష రూపాయలకు చేరుకోకపోయినా అన్ని పన్నులు, తరుగు, ఇతర ఖర్చులతో కలిపి ప్రస్తుతం లక్ష రూపాయలు ధర పలుకుతున్నట్లయింది. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయాలంటే అందరూ ఆలోచిస్తున్నారు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ కూడా దాదాపు ఎండ్ కావడంతో ఇక బంగారం కొనుగోలు చేసే ఆ కొద్ది మంది కూడా ఉండరన్న అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతుంది. జ్యుయలరీ దుకాణాలు ఎన్ని ఆఫర్లు ప్రకటించినప్పటికీ తులం బంగారం లేనిదే సరైన ఆభరణం రాకపోనుండటం కారణంగా బంగారానికి చాలా మంది దూరంగానే ఉంటున్నారు. వెండి ధరలు కూడా అంతే. ఇటీవల కాలంలో వెండి ధరలు భారీగా పెరగడంతో దానిని కొనుగోలు చేసే వారు కూడా కరువయ్యారు.
స్వల్పంగా తగ్గినా...
భారతీయ సంస్కృతిలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వెండిని కూడా సొంతం చేసుకోవడం శుభసూచకంగా భావించడం వల్ల విక్రయాలు జరుగుతుంటాయి. కానీ ధరలను చూసిన తర్వాత వీటి జోలికి రావాలంటే భయపడిపోతున్నారు. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించవచ్చు. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,960 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 117,900 ట్రేడ్ అవుతుంది.
Next Story