Fri Dec 05 2025 17:33:36 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈరోజే కొనేసేయండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

పసిడికి భారత్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పసిడి అంటే పడి చచ్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. అందులో మహిళలు ఎక్కువ. మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతుున్నాయి. దీంతో పాటు భారత్ లోని సంస్కృతి, సంప్రదాయాలు కూడా బంగారం వాడకాన్ని పెంచేలా చేశాయి. ప్రతి పండగకూ, వివాహాది శుభకార్యాలకు కూడా బంగారాన్ని వినియోగించడం సంప్రదాయంగా వస్తున్న ఆచారంగా మారడంతో బంగారాన్ని, వెండిని తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలంటే వినియోగదారులు భయపడిపోతున్నారు.
దక్షిణ భారతదేశంలో...
భారత్ లో అందులోనూ దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ బిస్కట్లు కంటే ఎక్కువగా బంగారు ఆభరణాలనే కొనుగోలు చేస్తారు. బంగారం విషయంలో మహిళలు ఎంత ధరలు ఉన్న వెనక్కు తగ్గరన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం లక్ష రూపాయలకు చేరువ అవ్వడంతో బంగారం కొనుగోలు చేయాలంటే మాత్రం జంకుతున్నారు. వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతున్నాయి. పెళ్లిళ్ల లో వెండి కంచాలు వరుడికి బహుమతిగా వరుడి కుటుంబం ఇస్తారు. అయితే వెండి ధరలు కూడా అమాంతంగా పెరగడంతో వెండి విక్రయాలు కూడా ఇటీవల కాలంలో మాత్రం భారీగా తగ్గిపోయినట్లు జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
గోల్డ్ తగ్గి.. బంగారం పెరిగి...
బంగారం అంటే ఇప్పుడు ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దాదాపు పది గ్రాముల ధర లక్ష రూపాయలకు చేరువగా ఉండటంతో పాటు వెండి ధరలు కూడా లక్ష రూపాయలు దాటి ఎక్కువగా కనపిస్తుండటంతో కొనుగోలు దారులు అటువైపు చూడటం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,290 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,590 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 1,07,100 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story

