Thu Dec 18 2025 12:06:47 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : తీపి కబురు.. బంగారం ధరలు తగ్గాయండోయ్... నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది

బంగారం ఎప్పుడూ బంగారమే. ఎందుకంటే బంగారం వన్నె తగ్గని విధంగానే ధరలు కూడా తగ్గవు. అందుకే ఎంతగా ధరలు పెరిగినా బంగారంపై మోజు మాత్రం ఎవరికీ తగ్గదు. అందులోనూ మహిళలకు బంగారం పట్ల ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. జనరేషన్స్ తో సంబంధం లేకుండా పాతతరం వారే కాదు నేటి తరం మహిళలు కూడా బంగారం కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. దీనికి కారణం బంగారం ఒంటి మీద ఉంటే సమాజంలో ఉండే గౌరవం వేరు. చుట్టాలు, పక్కాల నుంచి వచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. మహిళలు చీరలతో పాటు ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే చూసి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తుంటారు.
డిమాండ్ తగ్గకపోయినా...
అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కానీ ఇది ఒకప్పటి మాట. కానీ నేడు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వన్ గ్రామ్ గోల్డు, గిల్టు నగలతో శుభకార్యాలకు వస్తున్నారు. ఏది బంగారమో, ఏది కాదో? తెలియని పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఇలా సర్దుబాటు చేసుకుంటూ తమకు తాము తృప్తి చెందుతున్నారు. అయితే బంగారం ధరలు ఏ మాత్రం అందుబాటులోకి వస్తే మాత్రం మళ్లీ కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అందుకే ఎప్పడు ధరలు తగ్గుతాయోనన్న ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టే వారు సయితం మరికొంత ధరలు దిగివస్తే బంగారాన్ని కొనుగోలు చేయాలన్నభావనతో ఉన్నట్లు కనపడుతుంది.
కొద్దిగా తగ్గి...
బంగారు బిస్కెట్ల కంటే ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు కావడంతో పెరుగుతున్న ధరలతో పాటు జీఎస్టీ, ట్యాక్సులు, తరుగు అంటూ అదనంగా వసూలు చేస్తుండటంతో రేట్లు మరింతగా పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ప్రకారం ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి మారవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 88,940 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,030 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,10,800 రూపాయలుగాట్రెండ్ అవుతుంది.
Next Story

