Tue Jul 08 2025 17:53:22 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : కొనుగోలు చేయాలనే వారికి ఇదే మంచి టైం.. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

భారత్ లో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. గతంలో సీజన్ లో మాత్రమే ధరలు పెరిగేవి. డిమాండ్ కూడా సీజన్ లోనే కనిపించేది. కానీ సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన తర్వాత, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత బంగారం కొనుగోలుకు ఒక సీజన్ అంటూ లేకపోయింది. మంచి రోజు అనేది కూడా లేదు. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకే బంగారం దుకాణాలు 365 రోజులు కళకళలాడిపోతున్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో గత నాలుగు నెలల నుంచి కొనుగోలు చేసే వారు మాత్రం కరువయ్యారు. జ్యుయలరీ దుకాణాలు ప్రకటించిన ఆఫర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
వెండి స్థిరంగా...
దక్షిణ భారత దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సెంటిమెంట్ తో పాటు సొంతం చేసుకోవాలన్న తపన కూడా ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయల వరకూ తగ్గింది. ఉదయం ఆరు గంటలవరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర89,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,420 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,17,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story