Sun Jul 20 2025 00:08:26 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : పసిడిప్రియులకు గుడ్ న్యూస్... నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి.

బంగారం రోజురోజుకూ మరింత ప్రియంగా మారింది. ఇప్పుడు బంగారం అంటే కొందరికే సొంతమయింది. చాలా మందికి బంగారం ఎప్పుడో దూరమయింది. పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు ఎప్పుడు చేరుకుందో అప్పుడే బంగారానికి మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు దూరమయ్యారన్నది వాస్తవం. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక ఇప్పుడు బంగారు ఆభరణాలను ధరించడం ఖరీదైన వారి ఇళ్లలో సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. కేవలం సాదాసీదాగా ఉండటంతో పాటు సింపుల్ గా కనిపించడంతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో బంగారానికి ధరలు పెరుగుదలతో పాటు అనేక కారణాలతో వినియోగదారులు దూరమయ్యారని చెప్పాలి.
ధరలు పెరుగుతూనే...
బంగారం, వెండి ధరలు ఎప్పుడైనా పెరగొచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ధరలు పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. 2025 సంవత్సరం బంగారం ప్రియులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గత ఏడు నెలలుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ కొనుగోళ్లు పెద్దగా జరగకపోయినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. మరొక వైపు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎన్ని ఆఫర్లు, ఎన్ని రాయితీలను ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ధరలు పెరగకపోతే శుభవార్త అవుతుంది. అంటే ఏ రేంజ్ లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పెరిగాయన్నది తెలుసుకోవచ్చు.
నేటి ధరలు ఇలా...
బంగారం ఒకప్పుడు స్టేటస్ సింబల్. కానీ ఇప్పుడు మాత్రం బంగారాన్ని పోలిన నగలను ధరించి పెళ్లిళ్లు, శుభకార్యాలను జరుపుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూసినట్లే కనిపిస్తుంది. వన్ గ్రామ్ గోల్డ్ కు బాగా డిమాండ్ పెరిగిందంటున్నారు. ఇక ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,830 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,20,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Next Story