Tue Feb 17 2026 12:48:44 GMT+0530 (India Standard Time)
Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర స్వల్పంగా తగ్గింది

బంగారం ధరలు మరింత పెరగనున్నాయన్న అంచనాలు నిజం కావంటున్నారు మార్కెట్ నిపుణులు. ధరలు మరింత దిగి వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా చెబుతున్నారు. పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలలో పు వచ్చే అవకాశముందని కూడా అంటున్నారు. అమెరికా, రష్యా మధ్య డాలర్‌తో వాణిజ్యం జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 'US డాలర్‌తో ట్రేడ్‌కు రష్యా సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ చెప్పింది. అదే జరిగితే 10 గ్రాముల గోల్డ్ లక్షకు పడిపోవచ్చు. 2027 చివరి నాటికి 90 వేలు- లక్ష మధ్య స్థిరపడొచ్చు' అని స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.57 లక్షలుగా ఉంది.
గతంలో ఎన్నడూ లేనంతగా...
బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. కొనలేని పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు చేరుకున్నాయి. 2025 జనవరి నుంచి ప్రారంభమయిన బంగారం, వెండి ధరల పెరుగుదల మొన్నటి వరకూ సాగింది. కానీ అమ్మకాలు నిలిచిపోవడంతో పాటు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరలు తగ్గటానికి కారణమని చెబుతున్నారు. ధరలు పతనమవుతాయని గత కొన్ని రోజుల నుంచి అంచనాలు వినిపిస్తున్నప్పటికీ తగ్గడం లేదు. అయితే క్రమంగా ధరలు దిగి వస్తాయని చెబుతున్నారు. గత పది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ స్వల్పంగా పెరుగుతూ వస్తుండటంతో ఇంకా ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు.
నేటి గోల్డ్ రేట్స్...
పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో ఇక బంగారం, వెండి ధరలు పెరుగుతాయన్న అంచనాలు తప్పవుతున్నాయి. కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగియాని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై 1,310 రూపాయలు తగ్గింది. కిలో వెండి పై వంద రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,430 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,64,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

