Sat Dec 06 2025 03:05:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : లక్షకు టచ్ చేయనున్న బంగారం ధర
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాములు రేపు లక్ష రూపాయలకు చేరుకుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి

ఈ నెలలోనే పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరవవుతుందని అంచానాలు వినపడుతున్న నేపథ్యంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు కూడా బంగారం ధరలు ధరలు పెరగడంతో ఇంకా లక్ష కు టచ్ చేయడానికి ఎంతో సమయం పట్టదని అందరూ అంచనా వేస్తున్నారు. మూడున్నర నెలల్లో పది గ్రాముల బంగారం ధర ఇరవై వేల రూపాయల వరూ పెరిగింది.
నేడు ఎంత పెరిగిందంటే...
ప్రస్తుతం 98,350 రూపాయలకు నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో చేరుకుంది. ఈ ఒక్కరోజులోనే అంతర్జాతీయ మార్కెట్ లో ఎనభై డాలర్లకు పైగానే ధరలు పెరిగింది. రేపే లక్ష రూపాయలకు చేరుకోవచ్చని కూడా చెబుతున్నారు. డాలర్ విలువ పడిపోవడంతో పాటు అనేక కారణాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లయింది.
Next Story

