Tue Jan 21 2025 19:10:46 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : సంక్రాంతికి ముందే షాకిచ్చిన గోల్డ్ రేట్స్...మహిళల కంట కన్నీరే
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి. ప్రతిరోజూ మధ్యాహ్నానికి, సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపిస్తుంటుంది. ధరలు పెరగడమో, తగ్గడమో లేదా స్థిరంగా ఉండటమో జరుగుతుంది. ఈ హెచ్చుతగ్గులను చూసి కొనుగోలుదారులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అలవాటు పడిపోయారు. గత కొంతకాలంగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. అందుకని ధరలు పెరగడం సహజమేనని, అయితే ఎంత మేరకు ధరలు పెరిగాయని మాత్రమే కొనుగోలుదారులు లెక్కలు వేసుకోవడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. కానీ బంగారం ధరలను చూస్తూ మాత్రం ముట్టుకుంటే షాక్ అని చెప్పక తప్పదు.
కొనాలంటే...
ఒకప్పుడు బంగారం ధరలు అందరికీ అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం బంగారం అనేది అపురూపమైన వస్తువుగానే మిగిలిపోయే సమయం వచ్చింది. ధరలు ఇలా పెరిగితే బంగారం కొనుగోలు చేయడం వృధా అన్న పరిస్థితి అనేక వర్గాల్లో నెలకొంది. కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం భారమయినప్పటికీ అప్పులు చేసి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది తాము వేసుకున్న బడ్జెట్ కు అదనపు భారంగా మారింది. మోయలేని మోతగా మారిందని అనేక మంది ఆందోళన చెందుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం దిగిరావడం లేదు.
ధరలు పెరిగి...
బంగారానికి మాత్రం ధరలు పెరగడమే తెలుసు. తగ్గడం అనేది దానికి తెలియదు. అలాగే కొనేవారు కూడా కొద్దిగా తగ్గినప్పటికీ బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ఎక్కువ మంది కావడంతో సేల్స్ పరవాలేదని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కొనసాగవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,860 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,480 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 93,600 రూపాయలుగా నమోదయింది.
Next Story