Sat Dec 06 2025 15:47:47 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ధరలు ఇలా పెరిగితే బంగారాన్ని కొనుగోలు చేసేదెవరు భయ్యా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారి అంచనాలకు తగినట్లుగానే బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తుంది. కొనుగోలు చేయలేక చాలా మంది చేతులెత్తేస్తున్నారు. తమకు అవసరం ఉన్నప్పటికీ బంగారాన్ని దూరంగా పెడుతున్నారు. బంగారం విషయంలో ఇక కఠినంగానే ఉండాలని మహిళలే నిర్ణయించుకుంటున్నారంటే వాటి ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. గత పదిహేను రోజుల్లో పది గ్రాముల బంగారం ధర దాదాపు ఏడు వేల రూపాయల వరకూ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
సీజన్ నడుస్తున్నా...
ఇక ఈ నెల 30 వ తేదీన అక్షరతృతీయ ఉంది. పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుంది. అయితే బంగారం దుకాణాలకు వస్తున్న వినియోగదారులు ధరలను చూసి షాక్ తిని వెళ్లిపోతున్నారు. ఎక్కువ మంది ధరలను ఆరా తీయడం వెళ్లిపోవడం జరుగుతుందని, కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కనీసం పది గ్రాముల బంగారం ఉంటేనే ఆభరణం కంటికి కనిపిస్తుంది. అయితే పది గ్రాముల బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరుకోవడంతో కొనుగోలు దారులు వెనుకంజ వేస్తున్నారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగానే బంగారం, వెండి ధరలు గతంలో కంటే ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ చెబుతున్నారు.
ధరలు బంగారం మాత్రం...
ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం బంగారాన్ని కొనుగోలు చేయడం ఎవరి వల్లా కాదు. కనీసం పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం వైపు చూడకుండా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదని భావిస్తున్నారు. అందుకే ఒక్కసారిగా బంగారం, వెండి అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వందరూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై భారీగానే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,400 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 98,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

