Fri Dec 05 2025 17:49:39 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : గోల్డ్ లవర్స్ .. ఇక కొనేయండి.. నేడు ఎంత ధర తగ్గిందో తెలుసా?
బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు దిగి వస్తున్నాయి.

బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల నుంచి దాదాపు ఐదు వేల రూపాయల మేరకు పది గ్రాముల బంగారం ధర తగ్గింది. ఈ ఒక్కరోజు లోనే బంగారం ధరలురెండు వేల రూపాయలకు దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 2,180 రూపాయలు తగ్గింది.
నేటి ధరలు ఇవే...
ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,730 రూపాయలకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,750 రూపాయలకు చేరింది. ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు తగ్గింది. దీంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

