Fri Dec 05 2025 17:33:21 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగివస్తున్నాయ్.. నేటి ధరలు ఇలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు నిత్యం చుక్కలు చూపిస్తున్నాయి. వినియోగదారులు అసలు బంగారం గురించి ఇటీవల కాలంలో ఆలోచించడం కూడా మానేశారు. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయని తెలిసినా తమకు అందుబాటులోకి రావన్న ఆలోచనతో వారు బంగారం కొనేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడంలేదు. బంగారం అనేది ఇప్పుడు కొనుగోలు చేసే పరిస్థితి లేదని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అందులోనూ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తేనే బంగారం, వెండి వస్తువుల అమ్మకాలు ఊపందుకుంటాయి. వారే దూరమయితే కొనుగోళ్లు పూర్తిగా తగ్గుతాయి. ఈ లాజిక్ తెలిసి జ్యుయలరీ దుకాణాలు ఆఫర్లను భారీగా ప్రకటిస్తున్నాయి.
కూడబెట్టి కొనుగోలు చేసే...
గతంలో కొంచెం కొంచెం కూడబెట్టి, స్కీమ్ లు దుకాణాల్లో కట్టి బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు స్కీమ్ లు కట్టినా పెద్దగా ప్రయోజనం లేదు. తాము కట్టిన ధరకు బంగారం పెద్దగా వచ్చే అవకాశం లేదు. గ్రాము, రెండు గ్రాములకు మించి రావడం లేదని, అది కూడా మానేశారు. ఇదే సమయంలో కొనుగోలు శక్తి పెరగడంతో పాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగారం కొనుగోళ్లపై కొంత ఎఫెక్ట్ పడే అవకాశముందని అంటున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువై లాక్ డౌన్ వంటివి విధించినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా తమ వద్ద నగదు ఉండాలని భావించిన వాళ్లు బంగారం, వెండి వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ధరలు తగ్గి...
అందుకే ఇటీవల కాలంలో బంగారం అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బంగారం కొనుగోలు చేసే వారు ఇప్పుడు లేరని, అందుకు కారణం ధరలు భారీగా పెరగడమేనని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 160 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,470 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,10,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

