Thu Dec 18 2025 10:35:42 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : మహిళలకు గుడ్ న్యూస్... ఎప్పుడూ లేనంతగా ధరలు ఇలా దిగివస్తున్నాయంటే?
వరసగా రెండో రోజూ బంగారం ధరలు దేశ వ్యాప్తంగా తగ్గాయి. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. డిమాండ్ మాత్రం పసిడికి ఎన్నడూ తగ్గదు. బంగారానికి వన్నె ఎలా తగ్గదో డిమాండ్ కూడా అంతే. నిత్యం ధగధగ మెరసిపోతూనే ఉంటుంది. ధరలు కూడా భగ భగ మండిపోతూనే ఉంటాయి. కానీ ధరలు ఎంత పెరిగినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. భారతీయ సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేయక తప్పక ఖచ్చితంగా కొనుగోలు చేస్తుండటంతోనే గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు.
అనేక కారణాలు...
ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. పెరిగితే భారీగా తగ్గితే స్వల్పంగా ధరలు మనకు కనిపిస్తుంటాయి. అయినా ఇప్పటికీ పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు తప్పని సరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో జ్యుయలరీ దుకాణాలకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.
భారీగా తగ్గిన...
వరసగా రెండో రోజూ బంగారం ధరలు దేశ వ్యాప్తంగా తగ్గాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 700 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,800 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 77,000 రూపాయలుగా ఉంది.
Next Story

