Mon Apr 21 2025 18:34:49 GMT+0000 (Coordinated Universal Time)
కాస్త పెరిగిన బంగారం ధర

గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, మంగళవారం నాడు ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ. 87,070 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలో వెండి ధర రూ.99,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగి, పది గ్రాముల బంగారం రూ.79,810 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,070గా నమోదైంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,220గా ఉంది.
ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,810 వద్ద ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,960గా ఉంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలలో కిలో వెండి ధర రూ.99,400గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,06,900గా ఉంది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాలను విధించిన తర్వాత పెట్టుబడిదారులు బంగారం వైపు దృష్టి పెట్టారు. దీంతో అమెరికాలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
Next Story