Thu Dec 18 2025 12:23:19 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : కార్తీక పౌర్ణమి రోజు ఊరట.. బంగారం కొనుగోలు దారులూ క్యూ కట్టండి
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి

దేశంలోనే కాదు ప్రపంచంలోనే బంగారానికి ఉన్న డిమాండ్ మరి దేనికీ ఉండదు. భూమికి ఉన్న డిమాండ్ తర్వాత బంగారానికే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే బంగారానికి విశ్వవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అయితే అన్ని చోట్ల బంగారం ఆభరణాలు కొనుగోలు చేయరు. ఇతర దేశాల్లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. వాటిని మార్చుకుని బంగారంగానూ, నగదుగానూ చేసుకునే వీలుంటుంది.
ఇక్కడ మాత్రం...
అందుకే ఇతర దేశాల్లో గోల్డ్ బాండ్స్ కు ఎక్కువ డిమాండ్. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కువ మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కానీ పెరుగుతున్న బంగారం ధరలు వారి బడ్జెట్ కు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నారు.
ఈరోజు ధరలు...
ధరలు పెరిగినా మాత్రం బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగలేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,290 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ఉంది.
Next Story

