Fri Sep 13 2024 07:55:56 GMT+0000 (Coordinated Universal Time)
Today's Gold price:బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎంతున్నాయో తెలుసుకోండి!!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో
Gold Price In Hyderabad:బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న తులం బంగారం 700 రూపాయలు పెరగగా.. ఈరోజు మరో రూ.250 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 250 పెరిగి 59,700 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి 280 రూపాయల మేర పెరిగి 65,130 రూపాయలు దాటింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది.. దీంతో అక్కడ 59,850 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 280 పెరగడంతో బంగారం ధర 65,280 పలుకుతోంది.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.200 తగ్గి ప్రస్తుతం రూ. 74,500 వద్దకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 200 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం 78000 రూపాయల వద్ద ట్రేడింగ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2147 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.11 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Next Story