Thu Jan 29 2026 15:08:53 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : పండగపూట భారీగా తగ్గిన బంగారం ధరలు... వెండి కూడా
దీపావళి పండగ సమయంలో బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయని అందరూ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి

దీపావళి పండగ సమయంలో బంగారం ధరలు మరింత ప్రియం అవుతాయని అందరూ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. గత రెండు రోజుల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ధన్తెరాస్ కు కూడా కొనుగోళ్లు తగ్గడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. ధరలు తలకు మించిన భారంగా మారడంతో వినియోగదారులు కొనుగోలుదారులు సయితం బంగారం కొనుగోలుకు వెనకంజ వేస్తున్నారు. సాధారణంగా ధరలు ఎంత పెరిగినా డిమాండ్ తగ్గని వాటిలో భూమి ఒకటి కాగా, బంగారం కూడా మరొకటి.
పెరిగినప్పుడు...
కానీ పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో కొనుగోళ్లు ఎక్కువగానే ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కారణాలు ఏదైనా ధరలు తగ్గడం మంచిదే అయినా మరింత తగ్గితే ఇంకా మంచిదని కొనుగోలు దారులు భావిస్తున్నారు. పెరిగినప్పుడు ఎక్కువగా, తగ్గినప్పుడు తక్కువగా బంగారం ధరల విషయంలోనే మనం చూస్తుంటామని చెబుతున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై 450 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర పై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,550 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,630 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 76,000 రూపాయలు పలుకుతుంది.
Next Story

