రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ గిఫ్ట్.. అందులో ఏముందో వీడియోలో చూడండి
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నేడు జరగనుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నేడు జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో ఈరోజు అంగరంగ వైభవంగా రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ వివాహం జరగనుంది. పైవ్ స్టార్ హోటల్ బసలు, విలాసవంతమైన బహుమతులతో పెళ్లికి వచ్చిన అతిథులను రాజుల్లా చూసుకుంటున్న వేళ, రిలయన్స్ ఉద్యోగులు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ బాక్స్ అందుకున్నారు.
జూలై 12న అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ల పెద్ద భారతీయ వివాహానికి ముందు పలువురు రిలయన్స్ ఉద్యోగులు తమకు లభించిన గిఫ్ట్ బాక్స్‌ల ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరుపు రంగు బహుమతి పెట్టె బంగారు అక్షరాలతో రాసి గిఫ్ట్ బాక్స్‌ను ఉద్యోగులకు అందించారు.
బహుమతిలో ఏముంది?
గిఫ్ట్ బాక్స్ లోపల హల్దీరామ్ నమ్కీన్ నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి. దీనితో పాటు స్వీట్ల పెట్టె, వెండి నాణెం ఉన్నాయి. నమ్కీన్ ప్యాకెట్లలో హల్దీరామ్ ఆలూ భుజియా సెవ్, లైట్ చుడువా ఉన్నాయి.