Mon Mar 30 2026 10:25:23 GMT+0530 (India Standard Time)
వచ్చే నెల ఏప్రిల్ 3న బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 3వ తేదీన బ్యాంకులకు సెలవులున్నాయి

ఏప్రిల్ 3వ తేదీన బ్యాంకులకు సెలవులున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో బ్యాంకులు సెలవు ఉంది. ఏప్రిల్ 4వ తేదీన జీతాలు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయితే పరవాలేదు. మళ్ళీ ఏప్రిల్ 5తేదీన ఆదివారం అంటే ఆరోజు కూడా బ్యాంకులు సెలవు కావడంతో ఆరో తేదీ వరకూ జీతాల కోసం వెయిట్ చేయాల్సిందే.
ఈఎంఐలు ఉంటే...
మళ్ళీ 6వ తేదీనే జీతం క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే 6వ తేదీ లోపు ఏమైనా ఖర్చులుంటే ఈఎంఐ లేదా ఇతర ఖర్చులు వాటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. బ్యాంకు సెలవుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
Next Story

