Fri Dec 05 2025 14:25:44 GMT+0000 (Coordinated Universal Time)
అమెజాన్ లో 30 శాతం మందికి లేఆఫ్
అమెజాన్ తన వేర్ హౌస్ లలో 30 శాతం మందిని మాస్ లే ఆఫ్ చేసింది.

అమెజాన్ తన వేర్ హౌస్ లలో 30 శాతం మందిని మాస్ లే ఆఫ్ చేసింది. వారి స్థానంలో రోబోట్ లను ప్రవేశ పెట్టింది. రోబోలతో పని జరిపించాలని అమెజాన్ నిర్ణయించడంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే రోబోల పనితీరును పరిశీలించిన తర్వాత క్రమంగా మిగిలిన వారిని కూడా లే ఆఫ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వేర్ హౌస్ లలోనే...
అయితే కేవలం వేర్ హౌస్ లలోనే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ సిబ్బంది కంటే రోబోలు అత్యంత వేగంగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు కూడా అమెజాన్ యాజమాన్యం కనుగొనింది. వాటి పని తీరుని పరిశీలించిన తరవాత మూడు నెలల్లో రోబోట్లని ప్రవేశపెట్టి ఇంకో 50% మంది ఉద్యోగులని లే ఆఫ్ చేయబోతుం దన్న వార్తలు అమెజాన్ సిబ్బందికి ఆందోళనకు గురి చేస్తున్నాయి.చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్లు అన్నీ అదే బాట పట్టబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది.
Next Story

