Sat Mar 07 2026 11:11:22 GMT+0530 (India Standard Time)
Gold Rates Today : ముట్టుకుంటే షాక్.. బంగారం, వెండి ధరలు కొనాలంటే అప్పుడేనా?
ఈరో్జు దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధరలు భారీగా పెరిగాయి.

బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వెండి ధరలు బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా అటువైపు చూడటం లేదు. బంగారం అంటే ఒక రకంగా భయం పట్టుకుంది. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంది. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరకు చేరువలో ఉంది. అదే సమయంలో కిలో వెండి ధరలు రెండున్నర లక్షలకు దరిదాపుల్లో ఉన్నాయి. ఇంత పోసి బంగారం, ధరలు కొనుగోలు చేయడం అనేది చాలా కష్టమైన విషయం.
బంగారం భారంగా మారడంతో...
మరొక విషయం ఏంటంటే బంగారం విషయంలో మహిళలు గతంలో భర్తలను కూడా లెక్క చేసేవారు కాదు. తాము చిన్న చిన్నగా పొదుపు చేసుకున్న మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసేవారు. మరొకవైపు జ్యుయలరీ దుకాణాలు కూడా నెలవారీగా స్కీమ్ లు పెట్టేవి. నెలకు ఐదు వేలు కట్టినా ఏడాదికి అరవై వేలు మాత్రమే వస్తుంది. అంటే కనీసం పది గ్రాములు కాదు కదా.. ఐదు గ్రాముల బంగారం కూడా ఈ స్కీమ్ డబ్బులతో వచ్చే అవకాశాలు లేకపోవడంతో స్కీమ్ లు కట్టేవారు కూడా కనిపించడం లేదు. రాను రాను బంగారం మరింత భారంగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా అదుపు లేకుండా పరుగులు తీస్తాయంటున్నారు.
భారీగా పెరిగి...
ఇటీవల కాలంలో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ వినియోగదారులను షాకులకు గురి చేస్తున్నాయి. ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈరో్జు దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి కిలో పై పదకొండు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 1,29,220 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,220 రూపాయలకు పెరిగింది. కిలో వెండి ధర 2,74,000 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశముంది.
Next Story

