Mon Dec 09 2024 09:40:12 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : ఈ వీకెండ్ బిగ్బాస్ కి మెగా బాస్.. అందుకేనా ?
ఈ ఆదివారం.. బిగ్ బాస్ 6కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లకు..
బిగ్ బాస్ సీజన్ 6 .. నాల్గోవారం కూడా మరో రెండ్రోజుల్లో పూర్తి కానుంది. కెప్టెన్సీ రేస్ లో నుండి ఒక్కొక్కరు తొలగిపోగా.. శ్రీసత్య, ఆరోహి, కీర్తి, సుదీప, శ్రీహాన్ లు ఉన్నారు. వీరిలో కీర్తి ఈవారం హౌస్ కెప్టెన్ గా ఎన్నికైనట్లు సమాచారం. హౌస్ లో ఫస్ట్ లేడీ కెప్టెన్ అవుతోంది కీర్తి. కీర్తిని ఈ వారం డైరెక్ట్ గా నాగార్జునే నామినేట్ చేశారు. దాంతో ఈవారం తానే ఎలిమినేట్ అవుతానని భావించింది. ఇక దసరా స్పెషల్ గా.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచే బిగ్ బాస్ 6 ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంది.
ఈ ఆదివారం.. బిగ్ బాస్ 6కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్ అదిరిపోయాయి. ట్రైలరే అలా ఉంటే.. సినిమా ఇంకెలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి బిగ్ బాస్ వేదికపైకి రానున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ఈవారం బిగ్ బాస్ 6 టీఆర్పీ పెరగడం ఖాయం.
గతంలో బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లకు చిరంజీవి ఫినాలే గెస్ట్ గా వచ్చి విజేతలకు తన చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు. అలాగే నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా అక్టోబర్ 5నే విడుదల కానుంది. ది ఘోస్ట్ మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కు రానున్నట్లు సమాచారం. ఈవారం బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
Next Story