Sat Dec 07 2024 17:38:28 GMT+0000 (Coordinated Universal Time)
Telugu BigBoss Updates: బిగ్ బాస్ ఓటింగ్.. ఎవరి క్రేజ్ భారీగా తగ్గిపోయిందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరోవారం నామినేషన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరోవారం నామినేషన్స్ అక్టోబర్ 8 నాటికి ముగిశాయి. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేట్ చేసే అధికారం ముందుగా రాయల్ క్లాన్స్‌కు ఇచ్చినప్పటికీ తర్వాత ఓజీ క్లాన్కు కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఈవారం నామినేషన్స్‌లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. నామినేషన్స్‌లో యష్మీ గౌడ, యాంకర్ విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, మెహబూబ్ దిల్ సే, గంగవ్వ కూడా ఉన్నారు.
ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు మంగళవారం అర్థరాత్రి నుంచే ఓటింగ్ మొదలు కాగా ఓటింగ్‌లో గంగవ్వ దూసుకుపోతోంది. గంగవ్వ 22.15 శాతం (3,312 ఓట్లు) ఓటింగ్‌తో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ట్రెండ్స్ చెబుతున్నాయి. రెండో స్థానంలో మెహబూబ్ దిల్ సే, మూడో స్థానంలో యష్మీ నిలిచింది. విష్ణుప్రియ నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక పృథ్వీ ఐదో స్థానంలో, కిర్రాక్ సీత ఆరో స్థానంలో ఉన్నారు.
Next Story