Sat Dec 14 2024 15:28:36 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు బిగ్ బాస్ ను కనీసం చూడట్లేదుగా..!
ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు మంచి వ్యూవర్ షిప్ ను నమోదు
బిగ్ బాస్ తెలుగు.. ఒకప్పుడు ఆడియన్స్ ను కట్టి పడేసిన షో.. కానీ గత రెండు సీజన్లుగా దారుణమైన రేటింగ్స్ వస్తూ ఉన్నాయి. రొటీన్ గా టాస్క్ లు.. ఆహా.. ఓహో.. అనిపించేలా పెద్దగా సెలెబ్రిటీలు లేకపోవడంతో తెలుగు ఆడియన్స్ చూడడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. మహా అయితే ఒకరిని విలన్ గా చూపిస్తారు.. లేదంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వ్యక్తిని లాస్ట్ వరకూ తీసుకుని వెళ్తారనే ముద్ర కూడా పడిపోయింది. ఇక ఎలిమినేట్ అయిన వ్యక్తులు షోలో జరుగుతోంది ఒకటి మీకు చూపిస్తోంది మరొకటి అంటూ కంప్లైంట్స్ చేయడం కూడా మనం విన్నాం. ఇక ఆడియన్స్ ఓటింగ్ లను కూడా షో నిర్వాహకులు పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయండోయ్.
ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు మంచి వ్యూవర్ షిప్ ను నమోదు చేసింది. నాని, నాగార్జునలు కూడా మంచి రేటింగ్ వచ్చేలా షోను నడిపించారు. అత్యధికంగా బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ 18.8 టీఆర్పీ రాబట్టింది. తాజా సీజన్ దారుణమైన రేటింగ్ ఎదుర్కొంటోంది. బిగ్ బాస్ షో ఎపిసోడ్స్ కి కేవలం 2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తున్నట్లు సమాచారం. నాగార్జున వచ్చే వీకెండ్స్ లో 3-3.5 రేటింగ్ రాబడుతుందట. ప్రైమ్ టైంలో ఓ పాప్యులర్ షోకి ఈ రేటింగ్ అంటే చాలా తక్కువని అంటున్నారు. ఆ సమయంలో వచ్చే సీరియల్స్ 10 టీఆర్పీ వరకు రాబడుతుంటే బిగ్ బాస్ 6 వీకెండ్ ఎపిసోడ్స్ కూడా 4 టీఆర్పీ దాటలేకపోవడం దారుణమని అంటున్నారు. బిగ్ బాస్ 6 రేటింగ్స్ మెరుగయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు.
Next Story