Sat Dec 13 2025 22:34:15 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : తనూజ ఒక నిర్ణయం అలా.. మరొక నిర్ణయం ఇలా
బిగ్ బాస్ 9సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనూజ ఈసారి దివ్య పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది

బిగ్ బాస్ 9సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనూజ ఈసారి దివ్య పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. దివ్య తనను టార్గెట్ చేసినా ఆమెను ఎలిమినేషన్ నుంచి తప్పించి తనూజ మరొకసారి ఆడియన్స్ కు మరింత దగ్గరయింది. బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ప్రకటించారు. శనివారం నిఖిల్ ఎలిమినేట్ కాగా, ఆదివారం మాత్రం చివరగా గౌరవ్, దివ్య మిగిలారు. ఆడియన్స్ ఓట్ల ప్రకారం గౌరవ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే దివ్య వద్ద ఒక సేఫ్ కార్డు ఉంది. అది వాడి గౌరవ్ ను ఎలిమినేషన నుంచి కాపాడితే దివ్య ఎలిమినేట్ అవుతుంది. కానీ తనూజ మాత్రం తాను ఆడియన్స్ చెప్పిన తీర్పునకు కట్టుబడి ఉంటానని ప్రకటించింది. దీంతో దివ్య సేఫ్ అయింది.
బ్యాడ్ నేమ్ నుంచి తప్పించుకుని...
లేకుంటే దివ్య ఎలిమినేట్ అయ్యేది. మొన్నటి వరకూ తనూజకు, దివ్యకు హౌస్ లో పడేది కాదు. ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ లోనూ తనూజను తప్పించడానికి దివ్య అనేక రకాలుగా ప్రయత్నించింది. అయితే దానికి ప్రతీకారం తీర్చుకోకుండా తనూజ దివ్యను సేఫ్ చేసిందని ఎక్కువ మంది ప్రేక్షకులు ఆమెను మెచ్చుకుంటున్నారు. అలా కాకుండా గౌరవ్ ను సేవ్ చేసుంటే.. దివ్య ఎలిమినేట్ అయ్యేది కాని, కక్షతోనే హౌస్ నుంచి బయటకు పంపించిందన్న బ్యాడ్ నేమ్ తనూజపై పడేది. దాని నుంచి తనూజ తప్పించుకుని మరిన్ని మార్కులు కొట్టేసింది.
తడబడి దొరికిపోయి...
అయితే మరొక విషయంలో మాత్రం తనూజ కొంత తడబడి దొరికిపోయింది. ఇమ్మాన్యుయేల్ విషయంలో గొడవ పడిన తనూజ తర్వాత నాగార్జున అడిగిన ప్రశ్నకు తనకు హౌస్ లో ఎవూ సపోర్టర్స్ లేరని చెప్పింది. తాను ఎవరినీ సాయం చేయమని అడగలేదని కూడా చెప్పింది. ఇమ్మాన్యుయేల్ తో పాటు అనేక టాస్క్ లలో తనూజ హౌస్ మేట్స్ ను తనకు సహకరించాలని కోరిన క్లిప్పింగ్స్ ను పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తనూజ నాగార్జున అడిగిన వెంటనే తనకు సపోర్ట్ చేసే వారు ఎవరూ హౌస్ లేరని చెప్పడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. తొలి నుంచి తనూజనకు ఇమ్మాన్యుయేల్, భరణి, నిఖిల్, రీతూ చౌదరి, కల్యాణ్, డీమాన్ పవన్ లు సహకరిస్తూనే ఉన్నా ఒక్క మాటతో తనూజకు ఇన్నాళ్లూ తెచ్చుకున్న పేరు పోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇన్ని షేడ్స్ నీలో ఉన్నాయా? తల్లీ అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
Next Story

