Sat Dec 06 2025 08:42:38 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 Season : తొలి ఫినాలే టిక్కెట్ ను కైవసం చేసుకున్న కల్యాణ్
బిగ్ బాస్ సీజన్ 9 లో తొలి ఫినాలే టిక్కెట్ ను కల్యాణ్ పడాల కొట్టేశారు

బిగ్ బాస్ సీజన్ 9 లో తొలి ఫినాలే టిక్కెట్ ను కల్యాణ్ పడాల కొట్టేశారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, కల్యాణ్ పోటీ పడిన టాస్క్ లో కల్యాణ్ గెలిచాడు. తర్వాత కల్యాణ్, రీతూ చౌదరి పోటీ పడగా కల్యాణ్ గెలిచి ఈ రేసులో ఫస్ట్ టిక్కెట్ టు ఫినాలే రేసులో విజయం సాధించాడు. దీంతో బిగ్ బాస్ 9 సీజన్ లో తొలి ఫినాలే టిక్కెట్ ను గెలుచుకున్న కంటెస్టెంట్ గా కల్యాణ్ నిలిచాడు. కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ పడాల ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. ఆటల్లోనూ, వ్యవహార శైలిలో కల్యాణ్ ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు.
ఓటింగ్ లోనూ ముందంజ...
టైటిల్ కి అతి చేరువలో ఉన్న కంటెస్టెంట్స్ లో కళ్యాణ్ ఒకరు. మొదటి వారం నుండి కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ తో భారీ లీడింగ్ తో కొనసాగుతున్న తనూజ కి పోటీ ని ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ కల్యాణ్ మాత్రమే మూడవ వారం లో ప్రియా తో పాటు డేంజర్ జోన్ లోకి వచ్చిన కల్యాణ్ నాడు ఎలిమినేషన్ ని తప్పించుకుని తర్వాత తన ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. టాస్క్ లో అందరికంటే ముందుంటున్నాడు. తనూజను తోసిరాజని కల్యాణ్ ఓటింగ్ లోనూ ముందుకు దూసుకెళుతూ ఇప్పటికై ఫైనల్ కంటెస్టెంట్ లలో ఒకడయ్యాడు.
భరణిని ఎలిమినేట్ చేసి...
అయితే భరణి, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి పోటీ పడిన టాస్క్ లో భరణికి సంచాలకులిగా వ్యవహరించిన సంజన అన్యాయం చేసింది. రెక్ట్ యాంగిల్ పెట్టాలని చెప్పినా, రీతూ రింగులను దాచిపెట్టినా చివరకు సంజన రీతూనే విన్నర్ గా ప్రకటించింది. దీంతో భరణి ఫైర్ అయ్యాడు.సంచాలకులుగా ఉన్న సంజన తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఈ హౌస్ లోకి వచ్చిన నాటి నుంచి టాస్క్ లలో అన్యాయం జరుగుతుందని, తనను అన్యాయంగా పక్కకు తప్పిస్తున్నారని భరణి వాపోయాడు. ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున దీనిపై ఈ టాస్క్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది చూడాలి.
Next Story

