Fri Dec 06 2024 05:14:08 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 93 : విన్నర్ కి బంపరాఫర్స్.. ఎవరో ఆ లక్కీ పర్సన్ ?
శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో.. కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు నాగార్జున. మూడు సూట్ కేసులు పెట్టి అందులో..
బిగ్ బాస్ సీజన్ 6 ఆఖరి దశకు చేరుకుంది. ఇంకొక్కవారంలో గ్రాండ్ ఫినాలే. ఈ నేపథ్యంలో విన్నర్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఇంటి సభ్యులుండగా.. ఈ రోజు ఇనయ ఎలిమినేట్ అవనున్నట్లు తెలుస్తోంది. ఇక 6గురు సభ్యులున్నారు. మరి గ్రాండ్ ఫినాలే ఆరుగురితే చేస్తారా ? లేక మరో వారం పెంచుతారా ? అన్న విషయం తెలియాల్సి ఉంది.
శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో.. కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు నాగార్జున. మూడు సూట్ కేసులు పెట్టి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఆ సూట్ కేసులో ఉండే అమౌంట్ బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీకి యాడ్ అవుతుందని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి ఓ సూట్ కేసుని సెలెక్ట్ చేయగా అందులో 3 లక్షలు ఉండటంతో ప్రైజ్ మనీ రూ.47 లక్షల నుండి 50 లక్షలకు పెరిగింది. దానితో పాటు విన్నర్ కు రూ.25 లక్షల విలువ చేసే 600 గజాల స్థలం, మారుతి సుజుకి బ్రెజ్జా కారు కూడా బహుమతులుగా ఇవ్వనున్నారు. ఇవన్నీ గెలుచుకునే ఆ అదృష్టవంతులెవరో చూడాలి.
కాగా.. అంతకన్నా ముందు నాగార్జున.. హౌస్ మేట్స్ తమకు ఆడియన్స్ ఎందుకు ఓట్లువేసి గెలిపించాలో, పక్కవారికంటే తాము ఎందులో బెటరో కారణం చెప్పమన్నారు. అందుకు ఒక్కొక్కరు తమతమ కారణాలను వెల్లడించారు. ఇక ఈ రోజు ఎలిమినేషన్ జరగనుంది.
Next Story