Fri Oct 11 2024 08:23:32 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 38 : కొనసాగుతున్న ఎమోషనల్ కెప్టెన్సీ టాస్క్.. లిటిల్ ప్రిన్సెస్ ఇనయ
బయటికొచ్చిన గీతూ మొదటి ఆప్షన్ చెప్పకుండా రెండో ఆప్షన్ మాత్రమే చెప్పడంతో బాలాదిత్య సిగరెట్లను..
బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ వారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్ బ్యాటరీ రీఛార్జ్ పేరుతో ఎమోషనల్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి, శ్రీహన్, సుదీప ఈ టాస్క్ ని పూర్తి చేయగా మరికొంతమంది బుధవారం ఎపిసోడ్ లో ఈ టాస్క్ ని పూర్తి చేశారు. బుధవారం టాస్క్ ప్రారంభమయ్యే సమయానికి బ్యాటరీ 5 శాతం మాత్రమే ఉంది. దాంతో గీతూని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. బ్యాటరీ ఛార్జింగ్ పెరగాలంటే ఇంట్లో చక్కెరను వదులుకోవాలని లేదా.. బాలాదిత్య సిగరెట్లను త్యాగం చేయాలని చెప్పాడు.
బయటికొచ్చిన గీతూ మొదటి ఆప్షన్ చెప్పకుండా రెండో ఆప్షన్ మాత్రమే చెప్పడంతో బాలాదిత్య సిగరెట్లను వదులుకున్నాడు. ఛార్జింగ్ పెరిగిన తర్వాత గీతూని పిలిచిన బిగ్ బాస్.. మూడు ఆప్షన్లు ఇచ్చాడు. వాటిలో గీతూ తన తండ్రితో ఆడియో కాల్ ఆప్షన్ ని ఎంచుకుంది. ఆ తర్వాత అర్జున్ వాళ్ళ నాన్న దగ్గర్నుంచి వీడియో మెసేజ్ని తీసుకునే ఆప్షన్ తీసుకున్నాడు. తండ్రి వీడియో మెసేజ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్. ఈ మధ్యలో ఆర్జే సూర్య కూడా ఏడుస్తూ నేను బిగ్బాస్ లో ఉండను, వెళ్ళిపోతాను అనగా.. ఇనయ ఓదార్చింది.
ఇనయా వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ఫోటోని తీసుకునే ఆప్షన్ ఎంచుకుంది. ఆ ఫోటో వచ్చాక దాన్ని చూసి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఫైమాకి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో ఇంటి సభ్యులు కూడా సక్సెస్ అవ్వడంతో 85శాతం బ్యాటరీ రీచార్జ్ పెరిగింది. ఇక శ్రీసత్య వాళ్ళ అమ్మతో వీడియో కాల్ మాట్లాడే ఆప్షన్ తీసుకోవడంతో 35శాతం బ్యాటరీ తగ్గింది. అమ్మనాన్నతో మాట్లాడుతూ శ్రీ సత్య కూడా ఎమోషనల్ అయింది. ఇక బాలాదిత్య తన భార్య, పాపతో కాల్ మాట్లాడే ఛాన్స్ తీసుకున్నాడు. సూర్య.. ఇనయ బిగ్ బాస్ హౌస్ లిటిల్ ప్రిన్సెస్ లా ఉంటుందని రాజ్ తో అన్నాడు. ఇలా ఈ ఎపిసోడ్ కూడా ఎమోషనల్ గానే సాగింది.
Next Story