Sat Dec 07 2024 20:41:25 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా ? టాప్ 5లో ఉంటుందనుకున్నారుగా..
ఇక ఈ వారం శ్రీసత్య-ఇనయలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నిన్నటి నుంచి ప్రచారం జరిగింది. ఓటింగ్ ప్రకారం..
బిగ్ బాస్ సీజన్ 6 మొదలై 14 వారాలైంది. 14వ వారం వీకెండ్ వచ్చేసింది. 21 మందితో ప్రారంభమైన బిగ్ బాస్.. ఇప్పుడు 7 గురు కంటెస్టంట్స్ కి చేరింది. ప్రతివారంలాగే ఈవారం కూడా ఒకరు ఎలిమినేట్ అవనున్నారు. గతవారం ఫైమా ఎలిమినేట్ అవగా.. అంతకుముందు రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. మొదటివారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి, రెండవవారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఎలిమినేషన్లంటిలోనూ గీతూ ఎలిమినేషనే చాలా ఎమోషనల్ గా సాగింది. తన ఎలిమినేషన్ ను గీతూనే కాదు.. ఆమె ఏడుపు చూసి ఆడియన్స్ కూడా తట్టుకోలేక పోయారు.
ఇక ఈ వారం శ్రీసత్య-ఇనయలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నిన్నటి నుంచి ప్రచారం జరిగింది. ఓటింగ్ ప్రకారం ఇనయ బయటికొస్తున్నట్లు సమాచారం. ఇనయ ప్రవర్తన చూసిన ఆడియన్స్.. రెండు, మూడు వారాలకు మించి హౌస్ లో ఉండదనుకున్నారు. ఒక్కోవారం ఒక్కోలా ఉన్న ఇనయకు.. హౌస్ లో సూర్య తన క్రష్ అని చెప్పడంతో ఫాలోయింగ్ పెరిగింది. ఇక సూర్య ఎలిమినేషన్ తర్వాత మరో ఇనయని చూపించింది. ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ.. ఆమెలో ఆడాలన్న కసి తగ్గినట్లు స్పష్టంగా కనిపించింది. ఇక ఇంటికి కెప్టెన్ కావాలన్న కోరిక 13వ వారం తీరింది. సీజన్ 6లో ఆఖరి కెప్టెన్ ఆమె. 12 వారాలుగా వంట చేయని ఇనయ.. కెప్టెన్ అయ్యాక అందరికీ తానే వండిపెట్టడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. మరి నిజంగానే ఇనయ ఎలిమినేట్ అవుతుందా లేదా తెలియాలంటే.. రేపటి వరకూ ఆగాల్సిందే.
Next Story