Sat Dec 14 2024 16:45:08 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 76 : 11 వారాలైనా.. ఇంకా నాగ్ తో క్లాసులు.. ఆదిరెడ్డి, రేవంత్ లపై ఫైర్
నెక్ట్స్ శ్రీహాన్ కి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. అలాగే శ్రీహాన్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు నాగ్. శ్రీసత్యని ఒకలాగా..
బిగ్ బాస్ సీజన్ 6 మొదలై 11 వారాలు పూర్తవుతోంది. హౌస్ లో ఇంకా 10 మంది కంటెస్టెంట్లే ఉన్నారు. కానీ.. ఇప్పటికీ కొంతమంది తమ గేమ్ ఆడకుండా.. ఇది ఎందుకు చెయాలి.. అదెందుకు చేయాలన్న ధోరణిలోనే ఉంటున్నారు. ఫలితంగా ఆడియన్స్ కు బిగ్ బాస్ చూడాలంటేనే చిరాకొచ్చేలా చేస్తున్నారు. దీంతో ఈ వారం కూడా నాగార్జున హౌస్ మేట్స్ పై ఫైరయ్యారు. ముఖ్యంగా ఆదిరెడ్డి ఆటతీరుపై క్లాస్ తీసుకున్నాడు నాగ్. శనివారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో ముందుగా హౌస్ మేట్స్ అందరికీ "గట్టుమీద దాసు" పేరుతో ఓ కథ చెప్పాడు నాగార్జున.
ఆ తర్వాత హౌస్ మేట్స్ ఆటతీరుపై మాట్లాడటం మొదలుపెట్టారు. ఇటీవల ఆదిరెడ్డి అతితెలివి ప్రదర్శిస్తున్నాడు. గతంలో గీతూ బిగ్‌బాస్ మాట కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు ఆదిరెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. గత ఎపిసోడ్స్ లో ఇమ్యూనిటీ దక్కించుకునే గేమ్ ఇచ్చినప్పుడు ఇదంతా అనవసరం అన్నాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ ఇచ్చినప్పుడు కూడా నేను ఆడను, నాకు అవసరం లేదని సిల్లీగా తీసిపడేశాడు. గేమ్స్ లో అతితెలివి ప్రదర్శించాడు. దీంతో అంతా గీతూలాగే ఓవరాక్షన్ చేస్తున్నాడు అని ఆడియన్స్ కౌంటర్లు వేస్తున్నారని చెప్పాడు నాగార్జున. ఒక్కోసారి నీ ఆటతీరుతో బిగ్ బాస్ చూడాలన్నా ఇంట్రస్ట్ పోతుందన్నాడు.
బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినపుడు ఆడకుండా అనవసరమైన కారణాలు చెప్తున్నావని ఫైర్ అయ్యాడు నాగ్. నువ్వు ఆ టాస్క్ ఆడి ఎవిక్షన్ పాస్ గెలిచి ఉంటే జెన్యూన్ గా ఆడవాళ్ళని ఆపగలిగేవాడివి కదా, అప్పుడు ప్రేక్షకులు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ గేమ్ ఆడకుండా ఓ మూలాన కూర్చున్నావు. ఎవిక్షన్ పాస్ వేస్ట్ అన్నావు. నీకు గేమ్ గురించి తెలుసా? నువ్వేమన్నా తోపా? నువ్వు ఆడటానికి వచ్చావు, కానీ ఆడకుండా పక్కన వాళ్ళని మాటలతో మాయ చేస్తున్నావు. ఇలాగే ఎక్కువ చేస్తే గీతూలాగే నువ్వు కూడా వెళ్ళిపోతావు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
నెక్ట్స్ శ్రీహాన్ కి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. అలాగే శ్రీహాన్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు నాగ్. శ్రీసత్యని ఒకలాగా, మిగిలిన కంటెస్టెంట్స్ ని ఒకలాగా చూస్తున్నావు అనే సరికి.. అలా ఏమీ లేదన్నాడు శ్రీహాన్. అంతకుముందు వారాల్లోని ఒక వీడియో చూపించి శ్రీసత్యకి వంట రాదన్నపుడు ఏమీ అనకుండా.. కీర్తి రాదన్నపుడే నేర్చుకుని చేయాలని ఎందుకన్నావని అడిగారు. నువ్వు బాగా నటిస్తావ్ శ్రీహాన్ అని నాగ్ అనగా.. నిజమే సార్ అంది కీర్తి. శ్రీసత్య ఫ్రెండ్ అయితే బయట చూసుకో ఇక్కడ హౌజ్ లో కాదు అని వార్నింగ్ ఇచ్చాడు.
చివరగా కంటెస్టెంట్స్ కి మీమ్స్ గేమ్ అని పెట్టాడు నాగ్. కొన్ని పాపులర్ మీమ్ కౌంటర్ నేమ్స్ కార్డులు అక్కడ ఉంచి ఒక్కొక్కరిని ఒక్కో కార్డు ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి ఇమ్మన్నాడు నాగ్. రేవంత్‌కు.. 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ఆదిరెడ్డి ఇచ్చాడు. శ్రీసత్యకు 'ఓరి.. దీని వేషాలూ' అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్ కు.. 'ఓన్లీ వన్స్ ఫసక్' ఇచ్చింది ఫైమా. ఫైమాకు.. 'అట్లుంటది మనతోని' ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు.. 'సరె సర్లే, చాలా చూశాం' అనే ట్యాగ్ ఇచ్చింది కీర్తి. శ్రీహాన్ కు.. 'వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా?' అన్న మీమ్‌ను ఇచ్చింది ఇనయా.
శ్రీహాన్ కు.. 'మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్' అని అన్నాడు రోహిత్. శ్రీహన్ కు.. 'చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్' అన్న మీమ్‌ను ఇచ్చింది శ్రీసత్య. రేవంత్ కి.. 'ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా' అన్న మీమ్ ఇచ్చింది మెరీనా. ఆదిరెడ్డికి 'పని అయిపాయే' అని ఇచ్చాడు రేవంత్. ఎక్కువగా అందరూ శ్రీహాన్ ని టార్గెట్ చేశారు. మరి ఈ ఆదివారం ఎపిసోడ్ లో మెరీనా ఎలిమినేట్ అవుతుందని లీక్స్ చెబుతున్నాయి. నిజమో కాదో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.
Next Story