Fri Dec 06 2024 04:19:01 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 93 : జలజ వచ్చేసింది.. అరుపులతో భయపెట్టేసిన కంటెస్టెంట్
అర్థరాత్రి అయ్యాక సత్య.. హౌస్ మేట్స్ కి దెయ్యం కథ చెప్పడం మొదలుపెట్టింది. సగం కథ అయ్యేసరికి బిగ్ బాస్ అరుపులను..
బిగ్ బాస్ సీజన్ 6 రెండువారాలుగా సరదాగా సాగిపోతోంది. ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత కొందరు కంటెసంట్స్ ఆటతీరులో మార్పు వచ్చింది. గత వారం టికెట్ టు ఫినాలే టాస్కులు జరగ్గా.. ఈ వారం విన్నింగ్ అమౌంట్ లో కోల్పోయిన మొత్తాన్ని ఒక్కో టాస్క్ ద్వారా తిరిగి సంపాదించుకునేలా టాస్కులిస్తున్నాడు బిగ్ బాస్. ఇక గత సీజన్ల మాదిరి.. ఈ సీజన్లో జలజ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. జలజ వచ్చేసింది. అందుకు కారణం శ్రీసత్య.
అర్థరాత్రి అయ్యాక సత్య.. హౌస్ మేట్స్ కి దెయ్యం కథ చెప్పడం మొదలుపెట్టింది. సగం కథ అయ్యేసరికి బిగ్ బాస్ అరుపులను ప్లే చేశాడు. ఇలా కాసేపు దెయ్యం హంగామా కొనసాగింది. ఆ తర్వాత మనీ బ్యాక్ టాస్కులిచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఎవరు గెలుస్తారో ఇంటిసభ్యులు ముందుగా గెస్ చేసి చెప్పాలి. వాళ్లు చెప్పినవారు గెలిస్తే.. రూ.1,10,000 వెనక్కి వస్తాయి. హౌస్ మేట్స్ చెప్పినట్లే టీ కప్పుల టాస్కులో రేవంత్ గెలవగా.. ఆ అమౌంట్ విన్నింగ్ ప్రైజ్ మనీలో కలిసింది.
ఆ తర్వాత ఇచ్చిన టాస్కులో ఆదిరెడ్డి-కీర్తి, శ్రీహాన్-శ్రీసత్యలు జంటగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక ఈ టాస్కులో ఆదిరెడ్డి-కీర్తి గెలుస్తారని చెప్పగా.. శ్రీహాన్-శ్రీసత్యలు గెలుస్తారు. దాంతో వెనక్కి వచ్చిన అమౌంట్ అంతా మళ్లీ బిగ్ బాస్ ఖాతాలోకి చేరిపోతుంది. ఇక తర్వాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రేవంత్, ఇనయ పోటీ పడ్డారు. ఒక ఇసుక మూటను వేలాడ దీసి దీనికి చిన్న రంధ్రం పెట్టారు. కింద డబ్బాలు పెట్టారు. వీరిద్దరూ బాక్సింగ్ గ్లవ్స్ వేసుకుని ఆ ఇసుక మూటలను గుద్దుతూ ఉంటే ఇసుక డబ్బాలో పడుతుంది. ఎవరి డబ్బా త్వరగా నిండుతుందో వారే విజేత. ఇందులో రేవంత్ గెలిచాడు. ఇంటి సభ్యులు కూడా అతనే గెలుస్తాడని ఊహించారు. కాబట్టి రెండు లక్షలు ప్రైజ్ మనీకి కలిసింది.
Next Story