Thu Sep 12 2024 13:34:44 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 89 : టికెట్ టు ఫినాలే.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఆదిరెడ్డి కాదు..ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా ?
ఈ ముగ్గురికీ పెట్టిన టాస్క్ లో ఆదిరెడ్డికి తక్కువ పాయింట్లు రావడంతో గేమ్ నుండి అవుటయ్యాడు. ఫైనల్ గా రేవంత్-శ్రీహాన్..
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై13 వారాలు పూర్తికావస్తోంది. ఈ వారమంతా టికెట్ టు ఫినాలే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. 89వ రోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. టికెట్ టు ఫినాలే రేసు నుండి కీర్తి, శ్రీసత్య, ఇనయ తొలగిపోయిన విషయం తెలిసిందే. ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ లు రేసులో ఉండగా.. మరో రౌండ్ కోసం ఎవరో ముగ్గురిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలని బిగ్ బాస్..కీర్తి, శ్రీసత్య, ఇనయలకు సూచించాడు. దాంతో ఇనయ పాయింట్లు తక్కువగా ఉన్న వారిని ఎంపిక చేస్తాననడంతో హౌస్ మేట్స్ కోపంతో ఊగిపోయారు.
ఈ విషయంపై ఇనయ- రోహిత్ ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి సెల్ఫ్ క్విట్ అవుతున్నట్లు చెప్పాడు రోహిత్. ఆ తర్వాత ముగ్గురు ఏకాభిప్రాయంతో ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ లను తదుపరి రౌండ్ కి సెలెక్ట్ చేశారు. ఈ ముగ్గురికీ పెట్టిన టాస్క్ లో ఆదిరెడ్డికి తక్కువ పాయింట్లు రావడంతో గేమ్ నుండి అవుటయ్యాడు. ఫైనల్ గా రేవంత్-శ్రీహాన్ ల మధ్య పోటీ నెలకొంది. శ్రీహాన్, ఆదిరెడ్డిలకు చెరొక 14 పాయింట్లు రావడంతో.. ఇద్దరిలో ఎవరో ఒకరే పోటీపడాలని చెబుతూ.. మరో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో శ్రీహాన్ గెలిచాడు. చివరిగా రేవంత్-శ్రీహాన్ ల మధ్య పోటీ జరగ్గా శ్రీహాన్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఈ గేమ్ ప్రసారం కానుంది. ఇక ఈ వారం ఫైమా ఎలిమినేట్ అవుతుందంటూ లీక్స్ చెబుతున్నాయి.
Next Story