Sat Dec 14 2024 16:09:13 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 73 : నామినేషన్ నుండి సేఫ్ అయ్యేందుకు సరికొత్త గేమ్.. ఆ అమౌంట్ ప్రైజ్ మనీ నుండి కట్
ఈ టాస్క్ లో.. శ్రీహాన్, ఆదిరెడ్డి లక్ష రూపాయలు, శ్రీ సత్య, కీర్తి, రేవంత్ లు 4,99,999 రూపాయలు, మెరీనా, ఇనయ - 4,99,998..
బిగ్ బాస్ సీజన్ 6 73వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ గత సీజన్లలో ఎప్పుడూ లేనివిధంగా.. కొత్త గేమ్ పెట్టాడు. గత సీజన్లలో నామినేషన్ నుండి సేఫ్ అయ్యేందుకు ఎవిక్షన్ పాస్ ఇచ్చేవారు. అది తమ కోసం లేదా.. తమకు నచ్చినవారి కోసం వాడుకోవచ్చు. కానీ ఈసారి ప్రైజ్ మనీ 50 లక్షల్లో 5 లక్షల లోపు హౌస్ మేట్స్ సేఫ్ అయ్యేందుకు వదులుకోవాల్సి ఉంటుంది. ఒకరు రాసిందే మరొకరు రాయకూడదు. ఎవరెంత రాశారో ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరు ఎక్కువ అమౌంట్ రాస్తారో వారే నామినేషన్స్ నుండి సేఫ్ అవుతారు.
ఈ టాస్క్ లో.. శ్రీహాన్, ఆదిరెడ్డి లక్ష రూపాయలు, శ్రీ సత్య, కీర్తి, రేవంత్ లు 4,99,999 రూపాయలు, మెరీనా, ఇనయ - 4,99,998 రూపాయలు రాయగా.. రోహిత్ 2,51,000, రాజ్ 4,99,700 రూపాయలు చెక్ పై రాసి డ్రాప్ బాక్స్ లో వేస్తారు. బిగ్ బాస్ పెట్టిన రూల్ ని శ్రీసత్య బ్రేక్ చేసింది. శ్రీహాన్ కి తను రాసిన మొత్తాన్ని కోడ్ భాషల్.. తన చీరతో పోల్చి ఎంతమొత్తం రాసిందే చెప్పేసింది. దాంతో బిగ్ బాస్ శ్రీసత్యను డిస్ క్వాలిఫై చేశాడు. మిగతా వారిలో ఆదిరెడ్డి, రాజ్ మినహా.. ఇద్దరు, ముగ్గురు రాసిన అమౌంట్స్ మ్యాచ్ అయ్యాయి. ఆదిరెడ్డి కంటే రాజ్ రాసిన అమౌంట్ ఎక్కువ ఉండటంతో.. రాజ్ ఇమ్యూనిటీ పొందుతాడు. రాజ్ రాసిన అమౌంట్ 50 లక్షల నుండి మైనస్ అయి ప్రైజ్ మనీ 45 లక్షలకు తగ్గింది.
Next Story