Mon Dec 09 2024 07:17:24 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 69 : శనివారమే ఎలిమినేషన్.. అందరికీ క్లాస్ పీకిన నాగార్జున.. ఇదంతా టీఆర్పీ కోసమా
రేవంత్, ఇనయ లపై బాగా సీరియస్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ మీద అందరికి కంప్లైంట్స్ ఉన్నాయి. బిగ్‌బాస్ పెట్టిన..
బిగ్ బాస్ సీజన్ 6 లో కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. గత ఐదు సీజన్లలో ఆదివారమే ఉండే ఎలిమినేషన్ ని.. ఈ సీజన్ లో శనివారం నాటి ఎపిసోడ్ లోనే చేస్తున్నారు. ఆదివారం మరో ఎలిమినేషన్.. ఉండచ్చు.. ఉండకపోవచ్చన్నట్టుగా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. లీకుల్లో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు. సూర్య ఎలిమినేషన్ అప్పుడు కూడా ఇలాగే చేశారు. తీరాచూస్తే.. ఆదివారం ఎలిమినేషన్ లేదు. ఈ వారం కూడా శనివారమే ఎలిమినేషన్ చేశారు. చూస్తుంటే.. ఇదంతా టీఆర్పీ కోసం చేస్తున్నారన్నట్టుగా ఉందంటున్నారు ఆడియన్స్.
ఇక ఎప్పటిలాగానే నాగార్జున హౌస్ మేట్స్ పై ఫైరయ్యాడు. రేవంత్, ఇనయ లపై బాగా సీరియస్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ మీద అందరికి కంప్లైంట్స్ ఉన్నాయి. బిగ్‌బాస్ పెట్టిన రూల్స్ కి వ్యతిరేకంగా రేవంత్ ప్రవర్తించాడు, నువ్వు కోపం తగ్గించుకోమని ఎన్ని సార్లు చెప్పినా మారట్లేదు అని సీరియస్ అయ్యాడు. తర్వాత ఇనయ గురించి మాట్లాడుతూ.. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావ్.. జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగ్. ఫైమా కి ఇనయతో సారీ చెప్పించాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి డాక్టర్ పేషేంట్ అనే గేమ్ ఇచ్చాడు. డాక్టర్ లాగా మెడలో స్టెతస్కోప్ వేసుకొని అక్కడున్న ట్యాగ్స్ లో ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక ట్యాగ్ ఇచ్చి.. విరుగుడుగా కొన్ని డ్రింక్స్ ఇవ్వాలి. శ్రీసత్య.. రేవంత్‌కు మొండితనం, ఇనయ.. వాసంతికి ఇమ్మెచ్యురిటీ, రాజ్.. ఇనయకి వితండవాదం, ఫైమా.. ఇనయకు ఓవర్ కాన్ఫిడెన్స్, మెరీనా.. వాసంతికి నమ్మకద్రోహం, ఆదిరెడ్డి.. ఇనయాకి ఇగో, రేవంత్.. శ్రీసత్యకు కక్కుర్తి, రోహిత్.. ఇనయకు తలపొగరు, కీర్తి.. శ్రీసత్యకు ఇగో, బాలాదిత్య.. ఫైమాకు స్వార్థమెక్కువ, శ్రీహన్.. రేవంత్‌కు స్వార్థమెక్కువ, వాసంతి.. శ్రీసత్య మానిప్యులేటర్ అని ట్యాగ్స్ ఇచ్చారు.
టాస్క్ అనంతరం.. అనూహ్యంగా బాలాదిత్య ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. దాంతో ఇంట్లోవారంతా షాకయ్యారు. నామినేషన్స్ వాళ్ళందరిని ముందుకి రమ్మని.. బాలాదిత్య ఎలిమినేట్ అని చెప్పాడు. ఆదివారం ఇంకొక ఎలిమినేషన్ కూడా ఉంటుందని.. చెప్పి మరో షాకిచ్చాడు. ఇక స్టేజిపైకి వచ్చిన బాలాదిత్య.. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సలహా ఇచ్చి.. వెళ్లిపోయాడు. ఈరోజు మరో ఎలిమినేషన్ ఉంటుందో లేదో చూడాలి.
Next Story