Thu Sep 19 2024 01:22:21 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 68 : కొత్త కెప్టెన్ ఫైమా.. వరస్ట్ పర్ఫార్మర్ గా ఇనయ, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ?
ఫైమా కెప్టెన్ అవడానికి ఆదిరెడ్డి సపోర్ట్ చేశాడని, ఆదిరెడ్డి - ఫైమా కలిసి ఆడారని ఇనయా ఫైర్ అవ్వగా ఇనయా, ఆదిరెడ్డిల మధ్య..
బిగ్ బాస్ సీజన్ 6 10వ వారంతో కెప్టెన్సీటాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. దానిని సాగదీసి సాగదీసి.. ఫైనల్ గా ఫైమా కెప్టెన్ అయిన ఎపిసోడ్ ను నిన్న టెలీకాస్ట్ చేశారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ మాత్రం రసవత్తరంగా సాగింది. ఒకరికొకరు కొట్టుకొని, తోసుకొని, తిట్టుకొని, పోటీపడి మరీ ఆడారు. చివరికి పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో ఫైమా గెలిచి కెప్టెన్ గా ఎన్నికైంది.
ఫైమా కెప్టెన్ అవడానికి ఆదిరెడ్డి సపోర్ట్ చేశాడని, ఆదిరెడ్డి - ఫైమా కలిసి ఆడారని ఇనయా ఫైర్ అవ్వగా ఇనయా, ఆదిరెడ్డిల మధ్య గొడవ జరిగింది. ఆదిరెడ్డి ఏం చేస్కుంటావో చేసుకో, నువ్ అన్నదే నిజం అయితే బిగ్బాస్ వదిలి వెళ్ళిపోతానంటూ అరిచాడు. రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శ్రీహాన్, శ్రీసత్య గురించి తప్పుగా మాట్లాడటంతో శ్రీహాన్ రెచ్చిపోయి రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో స్టాంప్ వేసి రీజన్ చెప్పి.. జైల్లో పెట్టాలని ఆదేశిస్తాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఎక్కువమంది ఇనయాకి రెడ్ స్టాంప్ ఇవ్వడంతో అందరిపైనా ఫైరైంది.
ఎంతో క్లోజ్ గా ఉండి.. మంచి స్నేహితులైన శ్రీసత్య-రేవంత్ ల మధ్య కూడా గొడవ జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో వరస్ట్ సంచాలక్ గా చేశావని రేవంత్ కి వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు. ఎక్కువమంది ఇనయాకి ఇవ్వడంతో ఇనయా జైలుకి వెళ్ళింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతాడో, ఎవరు గేమ్ కరెక్ట్ గా ఆడారని చెప్తారో చూడాలి. అలాగే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం. శ్రీహాన్, ఇనయ, ఆదిరెడ్డి సేఫ్ జోన్లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు సేఫ్ అవుతారో చూడాలి.
Next Story