Sun Oct 06 2024 00:57:29 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 66 : ఈ సారి రేవంత్ టార్గెట్ అయ్యాడుగా.. మళ్లీ నోరుజారి.. ఏమీ తెలీదన్న ఇనయా
రేవంత్ తీరుతో.. పాముల టీమ్ రేవంత్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. ఫైమా, ఆదిరెడ్డి రేవంత్ పై విరుచుకుపడ్డారు. ఒకర్నొకరు..
బిగ్ బాస్ సీజన్ 6లో 10వ వారంలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. ఈ వారం టాస్క్ లో కంటెస్టంట్స్ మధ్య పోటీ మరింత పెరిగింది. 66వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో హౌసంతా హీటెక్కింది. గత ఎపిసోడ్ లో గేమ్ నుండి తొలగిపోయిన సత్య, ఇనయా, వాసంతి, రోహిత్ లకు కంటెండర్స్ అయ్యేందుకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నలుగురికి ఒక టాస్క్ ఇచ్చారు. వారిలో ఇద్దరు మాత్రమే కంటెండర్స్ అవుతారని చెప్పాడు. రేవంత్ సంచాలకుడిగా ఉన్న ఈ టాస్క్ లో ఇనయా, వాసంతి లు అవుటయ్యారు.
ఆటలో ఓడిపోయినందుకు ఇనయా ఫ్రస్టేట్ అయి మళ్లీ నోరుజారింది. బూతులు తిట్టేసి.. బాధలో మాట్లాడేశాను. నాకేం తెలీలేదు. తప్పుగా అనుకోకండి అంటూ.. ఏదో చెప్పాలి అన్నట్టుగా సారీ చెప్పి కంటెండర్ కాలేకపోయానంటూ బెడ్రూమ్ లో ఏడుస్తూ కూర్చుంది. ఇక మిగతా సభ్యులకి నాగమణి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కి ఇనయా, వాసంతి సంచాలకులు. నాగమణిని సంచాలకులు నిచ్చెనల టీమ్ కి ఇవ్వడంతో.. తమదే గెలుపు అనుకున్నారు ఆ టీమంతా. ఒక టీంకి కొన్ని మణులని ఇచ్చి వాటిని కాపాడుకోవాలని చెప్పాడు బిగ్బాస్. మరో టీం వాళ్ళ దగ్గర్నుంచి ఆ మణులని లాక్కోవాలని చెప్పాడు. ఇంకేముంది ఇది కూడా ఫిజికల్ టాస్క్ లా మారిపోయింది. ఎప్పటిలాగే రేవంత్ అందర్నీ తోసేయడం, కొట్టడం, లాగడం చేయడంతో అవతలి టీం వాళ్ళు కూడా రెచ్చిపోయారు.
రేవంత్ తీరుతో.. పాముల టీమ్ రేవంత్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. ఫైమా, ఆదిరెడ్డి రేవంత్ పై విరుచుకుపడ్డారు. ఒకర్నొకరు తోసేసుకొని, కాళ్ళు పట్టుకొని లాగేసుకొని నానా రచ్చ చేశారు కంటెస్టెంట్స్. ఈ టాస్క్ తర్వాత రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. అందరూ నా వీక్ నెస్ మీద కొట్టారు. నేను ఫిజికల్ లా ఆడాలని చూశారు. ఇప్పటికే ఎల్లో కార్డు ఇచ్చారు. ఈ సారి రెడ్ కార్డు ఇప్పించడానికి అందరూ కలిసి ప్లాన్ వేశారు. నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎవరికీ ఆడటం చేతకాక నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. నేను అనవసరంగా బిగ్బాస్ కి వచ్చాను అంటూ ఎమోషనల్ అయి ఏడ్చాడు రేవంత్.
పాముల టీమ్ వద్ద మణులు ఎక్కువగా ఉండటంతో.. వారే విన్నర్స్ అయ్యారు. ఇక నాగమణి ఉన్న మెరీనా కూడా కంటెండర్ అయింది. కెప్టెన్సీ టాస్క్ కి ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, మెరీనాలు పోటీపడనున్నారు. శ్రీహాన్ కంటెండర్ గా అర్హత పొందినా..గత వారం నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా శ్రీహాన్ కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే శ్రీహాన్ బదులు ఎవర్నైనా పంపించొచ్చు అని బిగ్బాస్ చెప్పడంతో శ్రీసత్యని పంపించాడు శ్రీహాన్. ఈవారం ఫైమా కెప్టెన్ అయినట్టు ఇప్పటికే లీకులొచ్చాయి.
Next Story