Mon Dec 09 2024 09:57:36 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 64 : మళ్లీ ఇనయానే టార్గెట్.. ఈవారం నామినేషన్స్ లిస్ట్ ఇదే
ఎవరు నామినేట్ చేసినా గొడవపడే ఇనయా.. కీర్తి నామినేషన్ చేసినపుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. మెరీనా.. ఆదిరెడ్డి..
బిగ్బాస్ సీజన్ 6 లో కంటెస్టంట్స్ మధ్య పోటీ పెరుగుతోంది. వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున క్లాసులివ్వగా.. ఇవ్వగా.. రెండు వారాలుగా ఆట చాలా సీరియస్ గా సాగుతోంది. గతవారం గీతూని ఎలిమినేట్ చేసి.. అందరికీ షాకిచ్చాడు బిగ్ బాస్. గీతూ ఎలిమినేషన్ తో కంటెస్టంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా హర్టయ్యారు. కొందరు మాత్రం హమ్మయ్యా.. అని ఫీలయ్యారు. ఇక ఎప్పటిలాగే సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ సారి నామినేట్ చేయాలనుకున్న వాళ్ళ ముఖంపై అక్కడ ఏర్పాటు చేసిన రంగు నీళ్లు పోసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పమన్నాడు బిగ్బాస్.
ఈ వారం కెప్టెన్ గా ఉన్న శ్రీసత్యని నామినేషన్స్ ప్రక్రియని మొదలుపెట్టమని ఆదేశించాడు బిగ్ బాస్. శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయలను నామినేట్ చేసి అందుకు కారణాలు చెప్పింది. గతవారం ఇనయా.. శ్రీసత్య, శ్రీహాన్ ల గురించి తప్పుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గొడవ పెట్టుకొని ఇనయాని నామినేట్ చేసింది. ఆదిరెడ్డి.. ఇనయని, రేవంత్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇనయాకి, ఆదిరెడ్డికి కూడా గట్టిగానే గొడవ అయింది. రేవంత్ ఫిజికల్ టాస్క్ లో అందర్నీ కొట్టాడని, తోసేశాడని నామినేట్ చేయగా నీకు ఆడే దమ్ము లేదు అంటూ రేవంత్ ఆదిరెడ్డిపై ఫైరయ్యాడు. వాసంతి.. ఇనయా, ఆదిరెడ్డిలని నామినేట్ చేసింది. రేవంత్.. వాసంతి, ఆదిరెడ్డిలని నామినేట్ చేశాడు. కీర్తి.. శ్రీహాన్, ఇనయాలని నామినేట్ చేసింది.
ఎవరు నామినేట్ చేసినా గొడవపడే ఇనయా.. కీర్తి నామినేషన్ చేసినపుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. మెరీనా.. ఆదిరెడ్డి, ఇనయాలని నామినేట్ చేసింది. రాజ్.. ఇనయా, శ్రీహాన్ లని నామినేట్ చేశాడు. రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డిలని నామినేట్ చేశాడు. ఫైమా.. వాసంతి, మెరీనాలని, శ్రీహాన్.. కీర్తి, ఇనయాలని, ఇనయా.. ఫైమా, శ్రీహాన్లను నామినేట్ చేసింది. గత వారం ఇనయా ఫైమాని ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచింది దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవే అయింది. గతవారం లాగే.. ఈవారం కూడా అందరూ ఇనయానే టార్గెట్ చేశారు.
గేమ్ ఆడకుండా సూర్య అని హడావిడి చేయడం, టీమ్స్ గా విడగొట్టినప్పుడు సొంత టీం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆడటంతో అందరూ కలిసి ఈ వారం ఇనయాని టార్గెట్ చేశారు. దీంతో అత్యధికంగా నామినేషన్స్ ఇనాయాకి వచ్చాయి. కాగా.. ఒకపక్క నామినేషన్స్ జరుగుతుంటే శ్రీహాన్, శ్రీసత్య జోకులేసుకుంటూ నవ్వుకున్నారు. దాంతో బిగ్ బాస్ ఇద్దరిపై సీరియస్ అయ్యాడు. కెప్టెన్ గా ఉండి ఇలా చేస్తావా అని అనడంతో.. శ్రీసత్య బిగ్బాస్ కి సారీ చెప్పింది. మొత్తంగా పదో వారంలో ఇంటిలో 12 మంది మిగలగా బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయాలు నామినేట్ అయ్యారు.
Next Story