Mon Oct 07 2024 15:30:05 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 58 : బాగా ఏడ్చిన బాలాదిత్య, ఇనయ.. సిగరెట్ కోసం గీతూని అనరాని మాటలన్న ఆదిత్య
కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు మొదలైంది. ఇంటి సభ్యులు రెండు టీమ్ లుగా విడిపోయి ఆడాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో ఎవరికి..
బిగ్ బాస్ సీజన్ 6.. 8వ వారం నుంచి ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ కు రేటింగ్ రాకపోవడానికి లీకులు ఒక కారణమైతే.. కంటెస్టంట్స్ ఆటతీరు పేలవంగా ఉండటం మరో మైనస్ అనడంలో సందేహం లేదు. గతవారం నుండి బిగ్ బాస్ 6 లీకులు కాస్త తగ్గాయి. అలాగే హౌస్ మేట్స్ కూడా ఎవరికి వారు ఆడుతున్నారు. గతవారం సూర్య ఎలిమినేట్ అవడంతో.. నువ్వే వెన్నుపోటు పొడిచావ్ అంటూ ఇనయను చాలా మంది టార్గెట్ చేసి మరీ నామినేట్ చేయడం తెలిసిందే. అది తట్టుకోలేని ఇనయ బాత్రూమ్ లోకి వెళ్లి బోరుమంది. బిగ్బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఆమెతో మాట్లాడారు. 'ఇక్కడికి రావడం వరకే మీ ఇష్టం, ఇంట్లోంచి పంపించడం అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది' అని చెప్పి పంపించారు.
కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు మొదలైంది. ఇంటి సభ్యులు రెండు టీమ్ లుగా విడిపోయి ఆడాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో ఎవరికి వారు తమ టీమ్ మెంబర్స్, లీడర్లను ఎంచుకున్నారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్ గా ఆడారు. మిగతావారంతా బ్లూటీమ్. వారి భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేస్తే ఆ టీమ్ సభ్యుడు చనిపోయినట్టే. ఒకరు మీద ఒకరు పడి స్ట్రిప్పులు లాక్కున్నారు.
మొదట ఫైమా, తరువాత బాలాదిత్య అవుట్ అయ్యారు. ఈ క్రమంలో గీతూ బాలాదిత్య వీక్ నెస్ తో ఆడుకుంది. గార్డెన్ ఏరియాలో దాచుకున్న సిగరెట్లు, లైటర్ ను శ్రీహాన్ తీసి గీతూకి ఇచ్చేశాడు. అవి కావాలంటే నాలుగు స్ట్రిప్పులు కావాలని అడిగింది గీతూ. దీంతో బాలాదిత్య ఎమోషన్ అయిపోయాడు. గీతూని 'నువ్వు ఎంతకు దిగజారుతున్నావో నీకైనా అర్థమవుతోందా.. నీకు సిగ్గు లేదా' అంటూ ఏడుస్తూ తిట్టాడు. ఆ తర్వాత బెడ్రూమ్ లో ఉన్న సిగరెట్లను శ్రీసత్య తీసి గీతూకి ఇచ్చేస్తుంది. మరోసారి బాలాదిత్యకు కోపమొచ్చినా.. కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు.
Next Story