Sun Dec 08 2024 07:08:27 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 52 : రేవంత్-ఇనయ జంటకు చుక్కలు చూపించిన గీతూ.. మరీ ఇంత శాడిజమా
ఫైనల్గా చేపల చెరువు టాస్క్ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్ 67, రేవంత్- ఇనయ 129, ఫైమా- రాజ్ 109..
బిగ్ బాస్ సీజన్ 6లో 8 వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్ కొంచెం ఫిజికల్ గానే పెట్టాడు బిగ్ బాస్. చేపల వేటలో ఎవరికి వాళ్లు.. తమవద్దనున్న చేపలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. బుధవారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో.. చేపల బొమ్మల కోసం ఏకంగా కొట్టుకొని, ఒకరి మీద పడి ఒకరు లాగేసుకొని రచ్చ రచ్చ చేస్తూ ఆడుతున్నారు. టాస్క్ మొదలైన రోజే.. గీతూ-ఆదిరెడ్డిల జంట గేమ్ నుంచి ఎలిమినేట్ అవడంతో బాగా హర్టయింది గీతూ. రేవంత్ వల్లే తన గేమ్ పోయిందని భావించిన గీతూ.. అర్థరాత్రి రేవంత్ వద్ద చేపలను దొంగిలించాలన్నా కుదర్లేదు.
అంతకుముందు రేవంత్ తన వద్ద నున్న చేపలను కాపాడుకునేందుకు బాత్రూమ్ లోనే పడుకుండిపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో.. సూర్య వెళ్లి డోర్ తట్టడంతో రేవంత్ అందులో నుంచి లేచి వచ్చాడు. బాత్రూమ్ లో నిద్రపోయిన రేవంత్ ని చూసి.. సూర్య, ఆదిరెడ్డిలు బాగా నవ్వుకున్నారు. మరోసారి గీతూ మెరీనాతో గొడవపెట్టుకుంది. నువ్వు గెలవట్లేదని ఫ్రస్టేట్ అవుతున్నావు అని అనేసింది. ఇంట్లో వాళ్ళు కూడా మెరీనా అన్నది కరక్ట్ అని అనడంతో గీతూ మరింత హర్ట్ అయింది. అయితే గీతూకి ఒక నల్ల చేప స్పెషల్ గా దొరకడంతో దాన్ని దాచుకుంది.
మళ్ళీ చేపల టాస్క్ ప్రారంభం అవడంతో ఈ సారి గీతూ, ఆదిలని సంచాలకులుగా చేశారు. అయితే గీతూ చేపలు పడుతుంటే సంచాలకులుగా ఉన్నవాళ్లు చేపలు పట్టకూడదు అని ఆది చెప్పినా పట్టించుకోలేదు. ఫైమాకి గోల్డ్ కాయిన్ దొరకడంతో నెక్స్ట్ టాస్క్ లో ఎవరెవరు ఉండొచ్చో ఫైమా నిర్ణయిస్తుందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో ఫైమా- రాజ్ తమ జోడితో పాటు సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్ జంటలు పోటీకి దిగుతాయని వెల్లడించారు. ఈ ఛాలెంజ్లో సూర్య- వాసంతి టీమ్ గెలిచి 15 చేపలు గెలుచుకుంది.
ఫైనల్గా చేపల చెరువు టాస్క్ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్ 67, రేవంత్- ఇనయ 129, ఫైమా- రాజ్ 109, సూర్య- వాసంతి 89, రోహిత్- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప దొరికిన వాళ్ళు రెండు జంటల చేపలను స్వాప్ చేయొచ్చని బిగ్బాస్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. గీతూ తనవద్దనున్న నల్లచేపను ఉపయోగించి రేవంత్- ఇనయల వద్దనున్నచేపలను శ్రీహాన్ - శ్రీసత్యలతో స్వాప్ చేస్తున్నట్లు బిగ్ బాస్ కి చెప్పింది. గీతూచేసిన పనికి రేవంత్-ఇనయలు బాగా హర్టయ్యారు. చివరగా రేవంత్ జోడీకి 67 చేపలు ఉండగా, శ్రీహాన్ జోడీకి 129 చేపలు వచ్చాయి. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట టాస్క్ నుంచి వెళ్లిపోయారు. నేటి ఎపిసోడ్ లో ఎవరు కెప్టెన్ అవుతారో తేలనుంది.
Next Story