Sun Oct 06 2024 01:05:09 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 51 : కెప్టెన్సీ కంటెండర్ కోసం కొట్టుకున్న హౌస్ మేట్స్..దద్దరిల్లిన హౌస్
చేపలు పట్టుకోవడం, వాటిని దాచుకోవడం చాలా పెద్ద టాస్క్ గా మారింది. చేపలు పట్టే విషయంలో ఒకర్నొకరు తోసుకొని..
బిగ్ బాస్ సీజన్ 6 లో గతవారం కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ కావడంతో.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో హౌస్ మేట్స్ చాలా సీరియస్ గా పోటీపడ్డారు. నామినేషన్స్ తో హీటెక్కిన హౌస్.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ తో అంతకు డబుల్ హీట్ అయింది. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇద్దరిద్దరిని కలిపి ఒక జంటగా ఆడాలని సూచించాడు. మొదట గాలిలో నుంచి చేపలు పడతాయి. ఆ చేపలు పట్టుకోవాలి, ఎవరు ఎక్కువ చేపలు పట్టుకుంటే వారే నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు అని చెప్పాడు బిగ్బాస్.
చేపలు పట్టుకోవడం, వాటిని దాచుకోవడం చాలా పెద్ద టాస్క్ గా మారింది. చేపలు పట్టే విషయంలో ఒకర్నొకరు తోసుకొని, ఒకరి మీద ఒకరు పడి, ఒకరి చేపలు ఇంకొకరు లాక్కొని బిగ్బాస్ హౌస్ లో విధ్వంసం సృష్టించారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో అందరి మధ్య గొడవలు అయ్యాయి. ఒకర్నొకరు తమ చేపలు లాక్కోవడానికి ఇంకొకరిని తోసేశారు కూడా. ఈ నేపథ్యంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ఇనయా, రేవంత్ జంట రెచ్చిపోయి మరీ ఆడింది. రెండు లెవల్స్ లోనూ వాళ్లే విన్నర్ అయ్యారు.
టాస్క్ మొదటిలో గీతూ కావాలనే హౌస్ మేట్స్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. మెరీనా, రోహిత్ తో గొడవ పెట్టుకుంది. అయితే గీతూ ఓడిపోవడంతో ఏడ్చేసింది. మరో లెవెల్ లో ఒక నలుగురిని తోపుడు బండి మీద కూర్చోపెట్టి ఇద్దరిద్దరు జంటల్ని ఆ బండిని తోయమని, ఎవరి వైపు ముందు వెళ్తే వాళ్ళు ఓడిపోయినట్టు చెప్పాడు బిగ్బాస్. ఈ టాస్క్ లో కూడా మాటల యుద్ధమే జరిగింది. ఇక్కడ కూడా ఇనయా, రేవంత్ రెచ్చిపోయారు. ఇనయ సూర్యని టార్గెట్ చేసి ఆడుతోంది. అతడిని ఖచ్చితంగా ఓడిస్తానని రేవంత్ తో చెప్తుంది. మరి ఈ రోజు జరిగే టాస్క్ లో ఎవరెవరు కంటెండర్స్ అవుతారు ఎవరు కెప్టెన్ అవుతారు చూడాలి.
Next Story